యువతిని బలి తీసుకున్న ఆన్‌లైన్‌ వేధింపులు

Woman Commits Suscide After Being Harassed By Online App
x

యువతిని బలి తీసుకున్న ఆన్‌లైన్‌ వేధింపులు

Highlights

Guntur: గుంటూరు జిల్లా మంగళగిరిలో వివాహిత సూసైడ్

Guntur: ఆన్‌లైన్‌ యాప్‌ వేధింపులు భరించలేక ప్రత్యూష అనే యువతి సూసైడ్ చేసుకుంది. ఆత్మహత్య చేసుకునే ముందు ఆమె తల్లిదండ్రులకు, భర్తకు సెల్ఫీ వీడియోను పంపింది. 20వేలు తీసుకున్న రుణానికి 2లక్షలు చెల్లించినా కూడా వేధిస్తున్నారని యువతి సెల్ఫీవీడియోలో వెల్లడించింది. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చినాకాకానికి చెందిన వివాహిత ప్రత్యూష లోన్‌ యాప్ ద్వారా 20 వేలు రుణం తీసుకుంది.

ఇంకా 8వేలు చెల్లించాలంటూ రెండు రోజుల నుంచి ఆమెకు కాల్ సెంటర్ నుండి వేధింపులు అధికమయ్యాయి. న్యూడ్ ఫోటోలను వైరల్‌ చేస్తామంటూ బెదిరించారు. దీంతో ఆమె మనస్థాపానికి గురై ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories