ఉద్యమకారుల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఉద్యమకారుల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
x
Highlights

ఉద్యమకారుల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం ఉద్యమకారుల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

గతంలో ప్రత్యేక హోదా సాధన కోసం పాల్గొన్న ఉద్యమకారులపై నమోదైన కేసుల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హోదా సాధన కోసం ఉద్యమించిన వారిపై నమోదైన అన్ని కేసులను ప్రభుత్వం ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర హోం శాఖ ముఖ్య కార్యదర్శి కె.ఆర్‌.ఎం. కిశోర్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యమకారులపై జిల్లాల వారీగా ఎన్ని కేసులు నమోదయ్యాయనే వివరాలను సేకరించే పనిలో హోం శాఖ నిమగ్నమైందని తెలిపారు. ఉద్యమకారులపై ప్రాసిక్యూషన్‌ ఉపసంహరించుకునేలా పిటిషన్‌ దాఖలు చేయాలని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్, అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లకు సూచించాలని రాష్ట్ర డీజీపీని ఆదేశించింది హోం శాఖ.

Show Full Article
Print Article
Next Story
More Stories