చంద్రబాబు పర్యటనపై రాయలసీమ విద్యార్థి జేఏసీ నిరసన

చంద్రబాబు పర్యటనపై రాయలసీమ విద్యార్థి జేఏసీ నిరసన
x
Highlights

రాయలసీమ విద్యార్థుల జాయింట్ యాక్షన్ కమిటీ (జెఎసి) నాయకులు కర్నూలు తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శించారు. "చంద్రబాబునాయుడును కర్నూలు...

రాయలసీమ విద్యార్థుల జాయింట్ యాక్షన్ కమిటీ (జెఎసి) నాయకులు కర్నూలు తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శించారు. "చంద్రబాబునాయుడును కర్నూలు పర్యటనకు మేము అనుమతించము" అని అన్నారు. ఇటీవల ఎన్నికలలో ఘోర పరాజయంపై పార్టీ నాయకులతో జిల్లాల వారీగా సమీక్షిస్తున్నారు చంద్రబాబు. అందులో భాగంగా డిసెంబర్ 2 నుంచి కర్నూల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. జిల్లా నాయకులతో సమీక్ష నిర్వహించేందుకు రెండురోజులు ఇక్కడే ఉండనున్నారు. అయితే రాయలసీమ విద్యార్థి జేఏసీ బాబు పర్యటనను వ్యతిరేకిస్తున్నారు. ఈ ప్రాంతం యొక్క ప్రయోజనాల కోసం గతంలో టీడీపీ ప్రభుత్వం పని చేయలేదని పేర్కొంది.

టిడిపి 'శ్రీబాగ్ ఒప్పందాన్ని' గౌరవించలేదని ఆరోపించారు. రాజధాని నగరాన్ని లేదంటే హైకోర్టును రాయలసీమకు మార్చడానికి అనుకూలంగా ప్రకటన చేసిన తర్వాతే చంద్రబాబునాయుడు జిల్లాలోకి ప్రవేశించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అమరావతిలో అభివృద్ధిని కేంద్రీకృతం చేయడం ద్వారా రాయలసీమకు టీడీపీ అన్యాయం చేసిందని నిరసనకారులు పేర్కొన్నారు. ఆంధ్ర ప్రాంతంలో రాజధాని నగరం, హైకోర్టు, ఐటి రంగం, ఎయిమ్స్, ఐఐటి, ఎన్‌ఐటి, మరియు ప్రధాన పరిశ్రమలను ఏర్పాటు చేయాలని గత టీడీపీ ప్రభుత్వం నిర్ణయించినందున రాయలసీమ ప్రాంతం అభివృద్ధిని కోల్పోయిందని వారు వ్యాఖ్యానించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories