Tirumala: తిరుమల నడకదారి మార్గంలో వైల్డ్‌లైఫ్‌ సైంటిస్ట్ బృందం పర్యటన.. నడక మార్గంలో కంచె ఏర్పాటుపై అధ్యయనం

Wildlife Scientists Team To Visit Walkway To Tirumala
x

Tirumala: తిరుమల నడకదారి మార్గంలో వైల్డ్‌లైఫ్‌ సైంటిస్ట్ బృందం పర్యటన.. నడక మార్గంలో కంచె ఏర్పాటుపై అధ్యయనం

Highlights

Tirumala: టీటీడీ, ఫారెస్టు అధికారులతో కలిసి పర్యటించిన బృందం

Tirumala: తిరుమల నడకదారిలో వైల్డ్ లైఫ్ సైంటిస్ట్ బృందం పర్యటించింది. అలిపిరి మెట్ల మార్గం, చిరుత దాడులు చేసిన ప్రాంతం.. పాపను చంపేసిన ఘటనా స్థలాన్ని వైల్డ్ లైఫ్ ఇన్ స్టిట్యూట్ అఫ్ ఇండియా సైంటిస్ట్‌లు పరిశీలించారు. భక్తుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. చిరుతల నుంచి భక్తులను సంరక్షించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో అటవీ, టీటీడీ అధికారులకు నివేదిస్తామని తెలిపారు సైంటిస్ట్ రమేష్. మరో రెండు రోజుల పాటు నడక మార్గాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తామన్నారు. నడక మార్గంలో ఫెన్సింగ్ నిర్మాణం సాధ్యమేనన్న సైంటిస్టులు.. ఎలా నిర్మించాలో అధ్యయనం చేసి నివేదిక ఇస్తామని తెలిపారు. టెక్నాలజీ సాయంతో వన్యప్రాణుల సంచారాన్ని గుర్తిస్తామన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories