ప్రియుడితో కలిసి.. భర్తను స్కార్పియోతో తొక్కించి..

ప్రియుడితో కలిసి.. భర్తను స్కార్పియోతో తొక్కించి..
x
Highlights

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించి భర్తను.. ప్రియుడి సహాయంతో అంతమొందించిందో మహిళ. ఈ ఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది. కర్నూలు జిల్లా మహానంది...

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించి భర్తను.. ప్రియుడి సహాయంతో అంతమొందించిందో మహిళ. ఈ ఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది. కర్నూలు జిల్లా మహానంది మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన ముడావత్‌ తులసీనాయక్, సాలిబాయికి 17 ఏళ్ల కిందట వివాహం అయింది. అయితే 2016 లో కడప జిల్లా టి.సుండుపల్లి మండలం మన్యంవారిపల్లెకు చెందిన దగ్గరి బంధువు మూడె రెడ్డినాయక్‌కు పెళ్లి సంబంధం కుదిర్చేందుకు సాలిబాయి వారింటికి వెళ్ళింది. ఈ కూర్మంలో అతనితో పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. దాంతో కొద్దిరోజులకు వీరి వ్యవహారం తులసీనాయక్ కు తెలిసి ఇద్దరిని మందలించాడు. అయినా ఆమె తీరులో మార్పు రాలేదు. పైగా ప్రియుడితో అనైతిక బంధానికి అడ్డుగా ఉన్నాడని భావించింది. ఈ క్రమంలో భర్తను అంతమొందించాలని ప్రియుడికి చెప్పింది. అందులో భాగంగా రెడ్డినాయక్‌ తన స్నేహితులైన చక్రాయపేట మండలం ఎర్రగుడి తండాకు చెందిన వినోద్‌కుమార్‌ నాయక్, చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం అయితేపల్లె గ్రామానికి చెందిన విజయ్‌కుమార్, విజయనగరం జిల్లా మండల కేంద్రమైన గంట్యాడకు చెందిన మునగపాటి జగన్నాథరాజుతో కలిసి.. తులసీనాయక్‌ను చంపేందుకు లక్ష రూపాయలకు సుఫారి కుదుర్చుకున్నారు. ముందుగా రూ.30 వేలు చెల్లించారు. ఈ నెల 12న తులసీనాయక్‌ను కడప జిల్లా దువ్వూరు మండలం చింతకుంట గ్రామ సమీపానికి తులసీనాయక్ తీసుకొచ్చారు.

అతనికి మద్యం తాగించారు. అనంతరం మద్యం బాటిల్‌తో కొట్టడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం స్కార్పియో వాహనంతో తొక్కించి కిరాతకంగా చంపారు. అనంతరం శవాన్ని దువ్వూరు మండలం పెద్దజొన్నవరం మిట్ట దగ్గర జాతీయ రహదారి కల్వర్టు పక్కన పడేసి వెళ్లిపోయారు. ఈ నెల 15న మృతదేహాని స్థానికులు గుర్తించడంతో దువ్వూరు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మృతున్ని తన భర్త అని చెప్పిన సాలిబాయి.. కేసును తప్పుదోవ పట్టించేందుకు మరో నాటకం ఆడింది. భర్తను హత్యచేసింది తమ గ్రామానికి చెందిన దమన పెద్దపుల్లయ్య అని సాలిబాయి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. అయితే సాలిబాయిపై అనుమానం వచ్చి.. ఆమె సెల్‌ఫోన్‌లోని కాల్‌ డేటాను పరిశీలించారు. అందులో ఆమె తన ప్రియుడు రెడ్డినాయక్‌తో రోజూ మాట్లాడుతున్నట్టు గుర్తించారు. వీరిద్దరికి వివాహేతర సంబంధం ఉన్నట్టు తెలుసుకున్నారు. ఆ తరువాత తమదైన శైలిలో విచారించడంతో హత్య విషయం బయటపడింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించి భర్తను ప్రియుడితో కలిసి చంపించినట్టు అంగీకరించింది. నిందితులను అరెస్టు చేసి.. కోర్టుకు హాజరు పరచనున్నట్టు పోలీసులు చెప్పారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories