అక్కడ వైసీపీ అభ్యర్థి భారీ మెజారిటీతో గెలుస్తారా?

అక్కడ వైసీపీ అభ్యర్థి భారీ మెజారిటీతో గెలుస్తారా?
x
Highlights

ఎన్నికలు ముగిశాయి... అభ్యర్థులు సేదతీరడంకోసం విదేశాలకు వెళ్లారు. నియోజకవర్గాల్లో గెలుపెవరిది అన్న చర్చ తీవ్రంగా జరుగుతోంది. ఒంగోలు పార్లమెంటు పరిధిలో...

ఎన్నికలు ముగిశాయి... అభ్యర్థులు సేదతీరడంకోసం విదేశాలకు వెళ్లారు. నియోజకవర్గాల్లో గెలుపెవరిది అన్న చర్చ తీవ్రంగా జరుగుతోంది. ఒంగోలు పార్లమెంటు పరిధిలో ఈసారి ఎవరు గెలుస్తారో అని పందేలు కాస్తున్నారు. ఈ స్థానం అప్పట్లో కాంగ్రెస్ కు కంచుకోటగా ఉండేది. కానీ మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా వైసీపీ బలపడింది. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులరెడ్డి, వైసీపీ అభ్యర్థిగా వైవీ సుబ్బారెడ్డి పోటీ చేశారు. 20 ఓట్ల భారీ మెజారిటీతో సుబ్బారెడ్డి గెలుపొందారు. అయితే 2019 ఎన్నికల్లో సీన్ కాస్త రివర్స్ అయింది వైసీపీ నుంచి మాగుంట శ్రీనివాసులరెడ్డి, టీడీపీ నుంచి మంత్రి శిద్దా రాఘవరావు పోటీచేశారు. ఒంగోలు పార్లమెంటు పరిధిలో.. ఒంగోలు, కనిగిరి, దర్శి, కొండెపి, మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో రెడ్లు, యాదవులు అధికంగా ఉన్నారు. గత ఎన్నికల్లో రెడ్లు వైసీపీ వైపు నిలిచారు.

అలాగే గతంలో ఒంగోలు, కనిగిరి, దర్శి, కొండెపి నియోజకవర్గాలు టీడీపీ ఖాతాలో చేరినా ఎంపీ స్థానం మాత్రం వైసీపీ గెలుచుకుంది. ఇందుకు కారణం పశ్చిమ ప్రకాశం.. మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు నిజయోజకవర్గాల్లో వైసీపీకి ఘననీయంగా ఓట్లు పడ్డాయి. దీంతో ఈజీగా వైసీపీ అభ్యర్థి గెలుపొందారు. యర్రగొండపాలెం, గిద్దలూరు నియోజకవర్గాల్లో రెండింటిలో కలిపి 40వేల పైచిలుకు మెజారిటీ వైసీపీకి వచ్చింది. అయితే ఆ పరిస్థితి ఇప్పుడు ఉండదని అంటున్నారు టీడీపీ నేతలు. ప్రస్తుత టీడీపీ అభ్యర్థి వైశ్య సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కావడంతో కనిగిరి, మార్కాపురం, గిద్దలూరు నియోజకవర్గాల్లో ఉన్న వైశ్యులందరు టీడీపీకి ఓటు వేశారని.. దానికి తోడు టీడీపీ సంప్రదాయ ఓటుబ్యాంకు ఎలాగో ఉంది.. కాబట్టి ఒంగోలు పార్లమెంటులో టీడీపీ గెలుపు ఖాయంగా తెలుగుతమ్ముళ్లు చెబుతున్నారు.

మరోవైపు పశ్చిమ ప్రకాశంలో తీవ్ర కరువు పరిస్థితి నెలకొని ఉందని. దీంతో రైతులందరు ప్రభుత్వంపై కోపంగా ఉన్నారని. వారంతా వైసీపీకి అనుకూలంగా ఓటు వేశారని.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా వైసీపీకి పడిందని.. దాంతో వైసీపీ గెలుపు ఖాయమని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇదిలావుంటే గెలుపెవరిదన్న దానిపై బెట్టింగ్ రాయుళ్లు సర్వేలు చేయించుకొని మరీ జోరుగా పందేలు కాస్తున్నారట.. ఇక్కడ మళ్ళీ వైసీపీ జెండాయే ఎగురుతుందని.. మాగుంట శ్రీనివాసులరెడ్డి భారీ మెజారిటీతో గెలుస్తారని భారీగా పందేలు కాయగా.. వైసీపీ కచ్చితంగా ఓడిపోతోందని.. కనీసం 5వేల మెజారిటీతో అయినా టీడీపీ అభ్యర్థి శిద్దా రాఘవరావు గెలుస్తారని పందేలు కాస్తున్నారు కొందరు. మరీ ఒంగోలు గిత్త ఎవరో తెలియాలంటే ఈనెల 23వరకు ఆగాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories