భీమవరంలో గెలుపెవరిదంటే..

భీమవరంలో గెలుపెవరిదంటే..
x
Highlights

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముగిశాయి.. ఎన్నికల ఫలితాల కోసం అందరూ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక భీమవరం నియోజవర్గంలో గెలుపెవరిది అని చర్చించుకోవడం...

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముగిశాయి.. ఎన్నికల ఫలితాల కోసం అందరూ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక భీమవరం నియోజవర్గంలో గెలుపెవరిది అని చర్చించుకోవడం మొదలెట్టాశారు. చర్చ ఎందుకంటే ఇక్కడినుంచి పోటీచేసేది ఆషామాషీ వ్యక్తి కాదు. సినిమాల్లో ఒక వెలుగు వెలిగి లక్షలాది మంది అభిమానుల గుండెల్లో గూడు కట్టుకున్న స్టార్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. జనసేన నుంచి ఆయన భీమవరం అసెంబ్లీ బరిలో నిలిచారు. అయితే వైసీపీ, టీడీపీనుంచి సైతం బలమైన అభ్యర్థులే నిలిచారు. వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాసరావు,

టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే పుఅలవర్తి రామాంజనేయులు పోటీ చేస్తున్నారు. దీంతో ఈ నియోజకవర్గంలో గెలుపెవరిదన్నది ఆసక్తికరంగా మారింది. కొందరేమో పవన్ కళ్యాణ్ 30 వేల ఓట్ల భారీ మెజారిటీతో గెలుస్తారని పందేలు కాస్తుండగా.. మరికొందరు వైసీపీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్ ఖచ్చితంగా గెలుపొందుతారని అంటున్నారు. మరోవైపు పూలవర్తి రామాంజనేయులు 20 పైచిలుకు ఓట్లతో గెలుస్తారని జోస్యం చెబుతున్నారు. మరి ఏది నిజమో తెలియాలంటే వచ్చేనెల 23 వరకు ఆగాల్సిందే. అయితే ఇక్కడినుంచి ఎవరు గెలుస్తారో మీ అభిప్రాయం ఈ కింది పోల్ ద్వారా తెలపండి.

Show Full Article
Print Article
Next Story
More Stories