ప్రొటెం స్పీకర్ ఆయనేనా..?

ప్రొటెం స్పీకర్ ఆయనేనా..?
x
Highlights

ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో జగన్ నేతృత్వంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయ దుందుభి మోగించింది. ఆ పార్టీ ఏకంగా 151 అసెంబ్లీ స్థానాలను...

ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో జగన్ నేతృత్వంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయ దుందుభి మోగించింది. ఆ పార్టీ ఏకంగా 151 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం కంటే ముందు ప్రొటెం స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. గెలిచిన ఎమ్మెల్యేల్లో అత్యధికసార్లు విజయం సాధించిన శాసనసభ్యుడు ప్రొటెం స్పీకర్ గా ఉంటారు. నూతన స్పీకర్ ఎన్నికయ్యే విధానాన్ని ప్రొటెం స్పీకరే నిర్వహిస్తారు. అయితే ఏపీలో గెలిచిన ఎమ్మెల్యేల్లో అత్యధికంగా 8 సార్లు విజయం సాధించారు చంద్రబాబునాయుడు..

ఆయన తరువాత ఆనం రామనారాయణరెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి 6 సార్లు విజయం సాధించారు. ఈ సారీ జరిగే సభలో అందరికంటే సీనియర్ చంద్రబాబే అవుతారు.. కాబట్టి ప్రొటెం స్పీకర్ అయ్యే అవకాశం చంద్రబాబుకు ఉంటుంది. కానీ అందుకు ఆయన ఒప్పుకుంటారా అన్నది సందేహంగా మారింది. పైగా సీఎంగా పనిచేసిన వ్యక్తి ప్రొటెం స్పీకర్ అవ్వకూడదని నిబంధన అంటూ ఏమి లేదు. ఒకవేళ ఆయన ఒప్పుకొని పక్షంలో ఆనం రామనారాయణరెడ్డి లేదా కాటసాని రాంభూపాల్ రెడ్డి లలో ఎవరో ఒకరికి అవకాశం దక్కనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories