రోజాకు టిక్కెట్ ఖరారు.. భానుకు అనుకూలం..

రోజాకు టిక్కెట్ ఖరారు.. భానుకు అనుకూలం..
x
Highlights

నగరి నియోజకవర్గ టిక్కెట్టు టిడిపి అధిష్టానానికి తలనొప్పిగా మారింది. పార్టీకి దశాబ్దాలపాటు సేవలందించిన ముద్దుకృష్ణమనాయుడు కుటుంబం ఈ ఎన్నికల్లో కుటుంబ...

నగరి నియోజకవర్గ టిక్కెట్టు టిడిపి అధిష్టానానికి తలనొప్పిగా మారింది. పార్టీకి దశాబ్దాలపాటు సేవలందించిన ముద్దుకృష్ణమనాయుడు కుటుంబం ఈ ఎన్నికల్లో కుటుంబ కలహాలతోనే పోటీకి సై అంటున్నారు. ముద్దుకృష్ణమ ఇద్దరు కొడుకుల మధ్య ఆధిపత్యపోరుతో నియోజకవర్గంలోని కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. తండ్రి బతికుండగా చేదోడువాదోడుగా ఉన్న భాను పార్టీ కార్యక్రమాల్లో యాక్టీవ్ గా ఉండేవాడు. చంద్రబాబు కూడా భాను పనితీరుపట్ల సంతృప్తిగా ఉన్నారనే టాక్ ఉన్నా.. ముద్దుకృష్ణమనాయుడు సతీమణి మాత్రం చిన్నకొడుకు జగదీశ్ కు ఈసారి టిక్కెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఈ క్రమంలో ఇద్దరిపై సర్వే చేయించగా ఇందులో భానుకు అనుకూలంగా వచ్చింది. దీంతో రెండు నెలల కిందట అమరావతికి పిలిచిన చంద్రబాబు గాలి కుటుంబసభ్యులతో మాట్లాడారు. ఆ సమయంలో ఎవరికి నగరి టిక్కెట్ ఇచ్చినా కష్టపడి గెలిపించుకుంటామని చెప్పి వచ్చినా.. నియోజకవర్గంలో ఎవరి దారి వారిదే అన్నట్టుగా మారింది. ఈ నేపథ్యంలో మరోసారి ఈ నియోజకవర్గంపై సమీక్ష నిర్వహించారు చంద్రబాబు. రోజాకు దీటైన అభ్యర్థి కోసం వేట ప్రారంభించారు.

నగరి నుంచి ప్రధానంగా ప్రస్తుత నియోజకవర్గ ఇన్‌ఛార్జి గాలి భానుప్రకాష్‌, ఆయన తమ్ముడు గాలి జగదీష్‌, సిద్ధార్థ ఇంజనీరింగ్‌ కళాశాలల ఛైర్మన్‌ కొండూరు అశోక్‌రాజు టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ, టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు గంధమనేని రమేశ్చంద్రప్రసాద్‌, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పాకా రాజా, నరేంద్ర తదితరులు అశోక్‌రాజుకు టికెట్టు ఇవ్వాలని కోరుతున్నారు. టిక్కెట్ కోసం ముగ్గురు నేతలు పోటీపడుతుండటంతో.. టీడీపీ కేంద్ర కార్యాలయ కార్యదర్శి, ఎమ్మెల్సీ జనార్ధన్‌ నేతృత్వంలో కమిటీ వేశారు. మెజారిటీ నేతలు అశోక్‌రాజుకే టిక్కెట్ ఇవ్వాలని సూచిస్తున్నా.. సర్వేలు భానుకు అనుకూలంగా ఉండటంతో ఎక్కువశాతం భానువైపే మొగ్గుచూపే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. అటు వైసీపీ నుంచి రోజా పేరు దాదాపు ఖరారైంది. ఆమె ఇప్పటికే నాలుగురూపాయల భోజనం మొబైల్ క్యాంటీన్ తో నియోజకవర్గ ప్రజలకు సేవలందిస్తున్నారు. ఇప్పటికే ఆమె ఇంటింటి ప్రచారం చేస్తూ సుడిగాలి పర్యటన జరుపుతున్నారు. పైగా ఇటీవల కొంతమంది టీడీపీ నాయకులను వైసీపీలో చేర్పించారు. ఈ క్రమంలో నగరిపై పట్టు కోల్పోయే ప్రమాదం ఉందని టీడీపీ గ్రహిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories