దొరకని కిరీటాల ఆచూకీ

దొరకని కిరీటాల ఆచూకీ
x
Highlights

శనివారం సాయంత్రం తిరుపతిలోని గోవిందరాజ స్వామి ఆలయంలో మాయమైన మూడు ఉత్సవమూర్తుల కిరీటాలు ఏమయ్యాయో ఎవ్వరికి అర్ధం కావడం లేదు. కిరీటాల మాయంపై తిరుపతి...

శనివారం సాయంత్రం తిరుపతిలోని గోవిందరాజ స్వామి ఆలయంలో మాయమైన మూడు ఉత్సవమూర్తుల కిరీటాలు ఏమయ్యాయో ఎవ్వరికి అర్ధం కావడం లేదు. కిరీటాల మాయంపై తిరుపతి అర్బన్‌ పోలీసులు మొత్తం ఆరు బృందాలుగా విడిపోయి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఆలయ సిబ్బంది, అర్చకులను ప్రశ్నించారు. శనివారం సాయంత్రం 5 గంటలకు విధులు మారే సమయంలో అంతా బాగానే ఉన్నాయని, తర్వాతే కనిపించకుండా పోయినట్లు తెలుస్తోంది. దీంతో సాయంత్రం 5.30 గంటల నుంచి 6 గంటల మధ్యనే కిరీటాలు మాయమై ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

భక్తుల రద్దీ తగ్గిన తర్వాత ఆలయ తలుపులన్నీ మూసి రహస్య విచారణ ప్రారంభించారు. అర్చకులతో పాటు విజిలెన్స్‌, తితిదే సిబ్బందిని ప్రశ్నించినా ఫలితం లేకపోయింది. ఆలయ పరిసరాల్లో అన్ని చోట్ల వెతికినా ఫలితం లేకపోయింది. ఆదివారం తెల్లవారుజామున 3 గంటల వరకు విచారణ నిర్వహించిన పోలీసులకు కిరీటాలు ఆచూకీ లభించలేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories