Weather Updates: ఏపీ లో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం

X
Highlights
Weather Updates: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా ఆంధ్రప్రదేశ్ లో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉంది.
K V D Varma6 Nov 2020 2:30 AM GMT
ఆంధ్రప్రదేశ్ లో అక్కడక్కడా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఒక పక్క చలిగాలుల తీవ్రత కూడా పెరుగుతోంది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దానిని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతం ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం శ్రీలంక తీరానికి దగ్గరలో నైరుతి బంగాఖాతంలోని గల్ఫ్ ఆఫ్ మన్నార్, దాని దగ్గరలో ఉన్న శ్రీలంక ప్రాంతాల్లో 0.9 కిలో మీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది. ఈ ప్రభావం వల్ల రానున్న 48 గంటల్లో కోస్తాంధ్రా, రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతోపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Web TitleWeather Updates rains are forecasted in some places of Andhra Pradesh today 6th November
Next Story