మే 25 వరకూ ఉష్ణోగ్రతలు ఇలా ఉంటాయి.. ఈ జాగ్రత్తలు తీసుకోవాలి..

మే 25 వరకూ ఉష్ణోగ్రతలు ఇలా ఉంటాయి.. ఈ జాగ్రత్తలు తీసుకోవాలి..
x
Highlights

ఐఎండి వాతావరణ సూచనల ప్రకారం మే 22 నుంచి 25 వరకు నాలుగు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.

ఐఎండి వాతావరణ సూచనల ప్రకారం మే 22 నుంచి 25 వరకు నాలుగు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ సూచించింది.

మొదటగా మే 22 న

శ్రీకాకుళం , విజయనగరం , విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 45°C-47°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక పశ్చిమగోదావరి, క్రిష్ణా , గుంటూరు , ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 43°C-44°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. అలాగే కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 41°C-42°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

☀మే 23

విశాఖపట్నం, క్రిష్ణా, గుంటూరు , ప్రకాశం, జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 46°C-48°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండగా.. విజయనగరం , చిత్తూరు, కర్నూలు పశ్చిమగోదావరి, నెల్లూరు, తూర్పుగోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 43°C-45°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే కడప, అనంతపురం, శ్రీకాకుళం జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 40°C-42°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తోంది.

☀మే 24

క్రిష్ణా , గుంటూరు , ప్రకాశం, నెల్లూరు, విజయనగరం , విశాఖపట్నం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 44°C-46°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని.. పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42°C - 43°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అలాగే కడప, అనంతపురం , కర్నూలు శ్రీకాకుళం, జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 39°C-42°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని స్పష్టం చేసింది.

☀ మే 25

ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 43°C-44°C ల వరకు ఉష్ణోగ్రతలు విజయనగరం , విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, క్రిష్ణా , గుంటూరు , కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 41°C-42°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అలాగే శ్రీకాకుళం జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 38°C-39°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణశాఖ అంచనా వేసింది.

ఎండలు అధికంగా ఉన్న కారణంగా ప్రజలు కుడా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె.కన్నబాబు సూచించారు.. వడగాడ్పులు రాకుండా మహిళలు, పిల్లలు, వృద్దుల విషయంలో జాగ్రత్త వహించాలన్నారు. డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి ORS, ఇంట్లో తయారుచేసిన నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి లస్సీ, నీరు మొదలైనవి త్రాగాలని సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories