ఆంధ్రప్రదేశ్ లో భానుడి భగభగలు

ఆంధ్రప్రదేశ్ లో భానుడి భగభగలు
x
Highlights

ఆంధ్రప్రదేశ్ లో వేడికి ప్రజలు అల్లాడిపోతున్నారు. గత రెండు రోజులుగా భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు.

ఆంధ్రప్రదేశ్ లో వేడికి ప్రజలు అల్లాడిపోతున్నారు. గత రెండు రోజులుగా భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. అంతకంతకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. శుక్రవారం సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పలు జిల్లాల్లో వడగాడ్పులు హడలెత్తించాయి. దీనికితోడు విపరీతమైన ఉక్కపోతతో జనం అల్లాడారు.

రాష్ట్రంలో అత్యధికంగా విజయవాడలో 46 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. అదేవిధంగా, బాపట్ల, జంగమహేశ్వరపురంలలో 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉంపన్‌ పెను తుపాను కారణంగా.. గాలిలోని తేమంతా తుడిచిపెట్టుకుపోవడం వల్లే రాష్ట్రంలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరిగాయని విశాఖ వాతావరణ శాఖ అధికారులు వివరించారు. రానున్న రెండు రోజులపాటు ఇదే పరిస్థితి ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉంటూ ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories