ఏఐ విప్లవంలో ఏపీని అగ్రపథాన నిలుపుతాం: లోకేష్

ఏఐ విప్లవంలో ఏపీని అగ్రపథాన నిలుపుతాం: లోకేష్
x
Highlights

దేశ ఏఐ విప్లవంలో ఆంధ్రప్రదేశ్ ను అగ్రపథాన నిలుపుతామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.

శాన్ ఫ్రాన్సిస్కో: దేశ ఏఐ విప్లవంలో ఆంధ్రప్రదేశ్ ను అగ్రపథాన నిలుపుతామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఏఐ యుగంలో నైపుణ్యాలు, విశ్వాసం, రంగాల మార్పును సమన్వయం చేయడం అనే అంశంపై (Aligning skills, Trust and Sectoral Transformation in the AI Era) శాన్ ఫ్రాన్సిస్కోలోని సిలికాన్ వ్యాలీలో జరిగిన బే ఏరియా కౌన్సిల్ సమావేశంలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘‘దేశంలోనే యువ రాష్ట్రాలలో ఏపీ ఒకటి. ప్రస్తుతం ఏపీ 180 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను కలిగి ఉంది. భవిష్యత్ లో ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యం. 15 శాతం వృద్ధితోనే ఇది సాధ్యమవుతుంది. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు క్లస్టర్ విధానంలో ముందుకు వెళ్తున్నాం. ఇందుకు ఆటోమోటివ్, రెన్యూవబుల్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్, సీబీజీ, ఓట్స్, ఆక్వా, ఏఐ వంటి దాదాపు 20 రంగాలను గుర్తించాం. ఆయా రంగాలను క్లస్టర్ విధానంలో అభివృద్ధి చేస్తాం. ఇందుకు కావాల్సిన ఎకో సిస్టమ్ ను ఏర్పాటుచేస్తాం. కియా గ్లోబల్ ఉత్పత్తిలో 9 శాతం ఏపీ నుంచే వస్తోంది. దేశంలో తయారయ్యే ఏసీల్లో 50 శాతం ఏపీ నుంచే తయారవుతున్నాయి. వచ్చే 24 నెలల్లో దీనిని 70శాతానికి తీసుకెళ్తాం.’’ అని వివరించారు.

పునరుత్పాదక శక్తిలో దేశంలోనే టాప్-5లో ఏపీ

పునరుత్పాదక శక్తిలో దేశంలోనే టాప్-5లో ఏపీ నిలిచిందని మంత్రి లోకేష్ చెప్పారు. ఆయా రంగాల్లో ఏపీ నెం.1 లేదా 2వ స్థానంలో ఉండేలా కృషిచేస్తున్నామన్నారు. ఏపీలోనే ఎందుకు పెట్టుబడులు పెట్టాలనే వారికి మూడు కారణాలు చెప్పారు. ఏపీలో అనుభవం, దార్శనికత కలిగిన సమర్థ నాయకత్వం ఉందని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అనుభవం కలిగిన నాయకుడని, ఆయనకు సుస్థిర ట్రాక్ రికార్డ్ ఉందని తెలిపారు. ఏపీలో ఎన్నికైన ఎమ్మెల్యేల్లో 50 శాతం మంది మొదటిసారి గెలిచినవారు ఉన్నారన్నారు. 25 మంది మంత్రుల్లో 17 మంది మొదటిసారి మంత్రులయ్యారని చెప్పారు. రెండో కారణం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఇతర రాష్ట్రాలు ఇవ్వలేని వేగాన్ని నిరంతరంగా తాము అందిస్తామన్నారు. ఒక్కసారి తమతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత అది మీ ప్రాజెక్ట్ కాదు.. మా ప్రాజెక్ట్ అన్నారు. ప్రతి ఎంవోయూను ట్రాక్ చేస్తామని, నిశితంగా పర్వవేక్షిస్తామని, ఒక నిర్థిష్టస్థాయి కంటే ఎక్కువ పెట్టుబడి ఉంటే ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ ద్వారా ఫాలో అఫ్ చేస్తామని చెప్పారు. దాదాపు 30 వాట్సాప్ గ్రూప్ ల్లో తాను ఉన్నట్లు మంత్రి లోకేష్ తెలిపారు.

మార్చిలో గూగుల్ డేటా సెంటర్ కు శంకుస్థాపన

‘‘ఆదిత్య మిట్టల్ తో నా మొదటి జూమ్ కాల్ నుంచి 16 నెలల్లోనే దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ గ్రౌండ్ బ్రేక్ అవుతోంది. పర్యావరణ అనుమతులు, హియరింగ్స్, భూమి కేటాయింపు, ఆర్ అండ్ ఆర్ అన్నీ పూర్తయ్యాయి. గూగుల్ తో మా సంభాషణ 13 నెలల్లోనే ముగిసింది. వచ్చే ఏడాది మార్చిలో గూగుల్ కు శంకుస్థాపన చేయబోతున్నాం. ఈ నెల 12 వ తేదీన కాగ్నిజెంట్ కు భూమిపూజ చేస్తున్నాం. మూడో కారణం ఏపీలో డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ ఉంది. ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాం.’’ అని మంత్రి లోకేష్ చెప్పారు.

దేశ ఏఐ విప్లవంలో ఏపీని అగ్రపథాన నిలుపుతాం

‘‘ఏపీలో గూగుల్ పెట్టుబడి ప్రారంభం మాత్రమే. ఇవాళ గూగుల్ లీడర్ షిప్ తో రెండు గంటల పాటు చర్చించాం. ప్రతి కుటుంబంలో ఏఐ నిపుణుడు ఉండాలనేది సీఎం చంద్రబాబునాయుడు విజన్. విద్య, ఆరోగ్యం.. ఏ రంగమైనా ప్రతి కుటుంబం ఏఐ ఆధారిత యూజ్ కేస్ సృష్టించాలి. ఏపీలో కాన్వర్సేషనల్ ఏఐ ద్వారా స్కిల్ సెన్సెస్ చేపడుతున్నాం. ఏసీ రిపేర్ టెక్నీషియన్ నుంచి ఏఐ ఇంజనీర్ వరకు స్కిల్ అసెస్ చేస్తాం. దేశ ఏఐ విప్లవంలో ఆంధ్రప్రదేశ్ ను అగ్రపథాన నిలపాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం’’ అని మంత్రి నారా లోకేష్ చెప్పారు.

ఈ సమావేశంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏఐ డేటా, ఇన్నోవేషన్ హెడ్ ఆండ్రీ డూయెట్, ఫ్యూజన్ ఫండ్ ఇన్వెస్ట్ మెంట్ పార్టనర్ డేవిడ్ గెర్ స్టర్, బెంజిమిన్ లార్సన్(ఇనీషియేటివ్ లీడ్, ఏఐ సిస్టమ్స్ అండ్ సేఫ్టీ, సెంటర్ ఫర్ ఏఐ ఎక్స్ లెన్స్, వరల్డ్ ఎకనమిక్ ఫోరం), పీటర్ లీరో-మునోజ్(ఎస్ వీపీ ఫర్ టెక్ ఇన్నోవేషన్ అండ్ పాలసీ, బే ఏరియా కౌన్సిల్), లూకే కోవాల్స్కీ(ఎస్ వీపీ కార్పోరేట్ ఆర్కిటెక్చర్, ఒరాకిల్), మాక్స్ లోబో(సీఈవో, ఆస్క్ మీడియా), విశాల్ మిశ్రా(జనరల్ పార్టనర్, క్లియన్ స్టోన్ వెంచర్స్), సీన్ రాండాల్ఫ్(సీనియర్ డైరెక్టర్, బే ఏరియా కౌన్సిల్ ఎకనమిక్ ఇన్ స్టిట్యూట్), వివేక్ వాద్వా(సీఈవో, వియోనిక్స్ బయోసైన్సెస్), సోంగీ యూన్(మేనేజింగ్ పార్ట్ నర్, ప్రిన్సిపల్ వెంచర్ పార్టనర్స్) తదితరులు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories