Kodali Nani: ప్రశాంత్ కిషోర్‌ను మేము పూర్తిగా వాడేశాం

We Used Prashant Kishor Completely Says Kodali Nani
x

Kodali Nani: ప్రశాంత్ కిషోర్‌ను మేము పూర్తిగా వాడేశాం

Highlights

Kodali Nani: ప్రశాంతి కిషోర్‌కు ఐప్యాక్‌కు సంబంధం లేదు

Kodali Nani: చంద్రబాబు, ప్రశాంత్ కిషోర్ భేటీపై మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని సెటైర్లు వేశారు. ప్రశాంత్ కిషోర్‌ను మేము పూర్తిగా వాడేశామని, ఆయన బుర్రలో గుజ్జంతా అయిపోయిందని కొడాలి నాని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఎంతమంది పీకేలను తీసుకొచ్చినా.. సీఎం జగన్‌ను ఏం చేయలేరన్నారు. తమకు వ్యూహకర్తగా ఉన్నప్పుడు ప్రశాంత్ సూచనలతో బాబాయ్ ని చంపి, జగన్ కోడి కత్తి డ్రామాలు అడారని చంద్రాబాబు గగ్గోలు పెట్టారని, మరి ఇప్పుడు చంద్రబాబు పీక కోయించుకుంటాడా అని ప్రశ్నించారు.

ఇండియా కూటమిలో చేరాలని మమతా బెనర్జీ పంపితే ప్రశాంత్ కిషోర్ వచ్చి చంద్రబాబును కలిశాడని కొడాలి నాని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు రెండు కళ్ళ సిద్దాంతాన్ని కొనసాగిస్తున్నాడని, ఒక పాట్నర్ బీజేపీతో చర్చలు జరుపుతుంటే.....మరో పీకె ఇండియా కూటమితో చర్చలు జరుపుతున్నాడని కొడాలి నాని జోస్యం చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories