వైసీపీలో చేరమని వేధిస్తున్నారు : మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి

వైసీపీలో చేరమని వేధిస్తున్నారు : మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి
x
Highlights

మాజీ ఎంపి, టీడీపీ సీనియర్ నాయకుడు జెసి దివాకర్ రెడ్డి ఏపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకులను బ్యూరోక్రాట్లను...

మాజీ ఎంపి, టీడీపీ సీనియర్ నాయకుడు జెసి దివాకర్ రెడ్డి ఏపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకులను బ్యూరోక్రాట్లను వేధిస్తున్నారని ఆరోపించారు. రాబోయే రోజుల్లో ఇలాంటివి పెరుగుతాయని జోస్యం చెప్పారు. వైఎస్‌ఆర్‌సిపి పార్టీలో చేరమని తమని, మైనింగ్‌ వ్యాపారులను కూడా బెదిరిస్తున్నారన్నారు. మాట వినకపోతే వారిపై కేసులు నమోదు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.సీఎం మాట వినకపోతే మాజీ చీఫ్ సెక్రటరీ లాగా బదిలీ అవుతారని అధికారులు భయపడుతున్నారు. రవాణాలో తనకు 74 సంవత్సరాల అనుభవం ఉందన్న జేసీ.. తానెప్పుడూ నిబంధనలను ఉల్లంఘించలేదని స్పష్టం చేశారు. ట్రిబ్యునల్ ఆదేశాలు ఇచ్చినప్పటికీ తన వాహనాలను బయటకు రావడానికి అనుమతించలేదని అధికారులపై మండిపడ్డారు జేసీ.

కాగా జెసి దివాకర్ రెడ్డి "దివాకర్ ట్రావెల్స్" కు చెందిన 5 బస్సులను సోమవారం ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. నిబంధనలకు విరుద్ధంగా ఈ బస్సులను నడుపుతున్నట్టు అధికారులు గుర్తించారు. దాంతో ముందుగా నోటీసులు ఇచ్చి ఈ బస్సులను సీజ్ చేశారు. అనంతపూర్ జిల్లా రవాణా కమిషనర్ శివరామ్ ప్రసాద్ అలాగే రవాణా శాఖ అధికారులు జెసి దివాకర్ రెడ్డి చెందిన బస్సులపై దాడులు నిర్వహించారు. ఇంటర్ స్టేట్ క్యారియర్ పర్మిట్ లేకపోవడంతో వారు 5 బస్సులను గుర్తించి సీజ్ చేశారు. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం, ఇష్టానుసారం టికెట్ల ధరలు వసూలు చేయడం తదితర అంశాలకు సంబంధించి దివాకర్ ట్రావెల్స్ కేసులు నమోదయ్యాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories