టీడీపీలో ఎవరూ మిగలరు.. రాంమాధవ్‌ సంచలన వ్యాఖ్యలు..

టీడీపీలో ఎవరూ మిగలరు.. రాంమాధవ్‌ సంచలన వ్యాఖ్యలు..
x
Highlights

టీడీపీపై బీజేపీ జాతీయ కార్యదర్శి రాంమాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఆ పార్టీలో ఎవరూ మిగలరని వ్యాఖ్యానించారు. బుధవారం గుంటూరు జిల్లాలో గాంధీజీ...

టీడీపీపై బీజేపీ జాతీయ కార్యదర్శి రాంమాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఆ పార్టీలో ఎవరూ మిగలరని వ్యాఖ్యానించారు. బుధవారం గుంటూరు జిల్లాలో గాంధీజీ సంకల్పయాత్ర ర్యాలీని ప్రారంభించారు. అనంతరం రాంమాధవ్ మాట్లాడుతూ.. టీడీపీ మునిగిపోతున్న నావలాంటిదని.. భవిష్యత్తులో ఆ పార్టీలో ఎవరూ ఉండే అవకాశం లేదని జోస్యం చెప్పారు.

టీడీపీ నుంచి బీజేపీలోకి కొందరు నేతలు చేరుతున్నారు.. ఈ వలసలను ఆపటానికే బీజేపీతో పొత్తు గురించి చంద్రబాబు మాట్లాడుతున్నారని, ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా.. పొత్తు ఉండదని తేల్చిచెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీకి ప్రత్యామ్నాయంగా, వైసీపీకి సమాంతరంగా బీజేపీ ఎదుగుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు రాంమాధవ్.. ఏపీలో నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని రాంమాధవ్ స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories