ప్రకాశం జిల్లా పొదిలిలో సాగునీటి కష్టాలు.. సాగర్ నీళ్లు ఇవ్వాలంటూ ఆందోళనలు

Water Problems in Podili Prakasam District
x

ప్రకాశం జిల్లా పొదిలిలో సాగునీటి కష్టాలు.. సాగర్ నీళ్లు ఇవ్వాలంటూ ఆందోళనలు

Highlights

Water Problems: వాటర్ ప్లాంట్ లో కెమికల్స్ వల్ల ఆరోగ్యసమస్యలు

Water Problems: ప్రకాశం జిల్లా పొదిలిలో సాగునీటి కష్టాలను తీర్చాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. సాగర్ నీళ్లు ఇవ్వకుండా అధికారులు ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేసవి కాలం రావడంతో త్రాగునీటి ఎద్దడి తీవ్రంగా మారిందని ఎన్ఏపి పంపింగ్ హౌస్ సాగర్ కొళాయి వద్ద ఆందోళనకు దిగారు. దర్శి సాగర్ కెనాల్ నుండి సాగర్ నీటి కోసం నిద్రహారాలు, పనులు మానుకొని తెల్లవారు జామున మూడు గంటల పలు గ్రామాల నుండి వచ్చి క్యూలో నిలబడాల్సి వస్తుందన్నారు.

తమకు సాగర్ నీళ్లు ఎందుకు ఇవ్వరు అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సాగర్ నీటిని ఇవ్వడంలో అధికారులు కూడా విఫలం చెందారని.. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. మినరల్ వాటర్ ప్లాంట్లలలో కెమికల్స్ అతిగా వాడడం వల్ల తమ ప్రాణాలకు నష్టం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories