Top
logo

శ్రీశైలం జలాశయానికి మళ్లీ వరద ప్రవాహం

శ్రీశైలం జలాశయానికి మళ్లీ వరద ప్రవాహం
X
Highlights

శ్రీశైలం జలాశయానికి మళ్లీ వరద ప్రవాహం శ్రీశైలం జలాశయానికి మళ్లీ వరద ప్రవాహం

రాయలసీమలో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం మళ్లీ పెరిగింది. అనంతపురం వరుసగా మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో సుంకేసుల రిజర్వాయర్‌ కు వరద తాకిడి పెరిగింది. జలాశయం పూర్తిగా నిండిపోయింది. జలాశయంలోకి 90 వేల క్యూసెక్కులు వస్తుండడంతో అధికారులు 14 గేట్లు ఎత్తి శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు. అటు తుంగభద్రకు వరద ఉధృతి పెరిగింది. సుంకేసులతో పాటు తుంగభద్ర నుంచి వరద భారీగా వస్తుండడంతో శ్రీశైలం రిజర్వాయిర్ మరోసారి నిండుకుండలా మారింది. ప్రాజెక్ట్‌ గరిష్ట నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 884 అడుగుల నీటిమట్టం కొనసాగుతోంది. సాగునీటి కాల్వలకు 80 వేల క్యుసెక్కులను విడుదల చేస్తు .. జల విద్యుత్‌ ను కొనసాగిస్తున్నారు.అలాగే విద్యుత్‌ ఉత్పాదన అనంతరం రెండు పవర్‌ హౌస్‌ల ద్వారా 78,289 క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు.

Next Story