సిట్‌పై ఏపీలో రాజకీయ దుమారం.. టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధం

సిట్‌పై ఏపీలో రాజకీయ దుమారం..  టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధం
x
Highlights

ఏపీలో సిట్‌ చిచ్చు రాజుకుంది. రాజకీయ దుమారం రేపుతోంది. అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సిట్ ఏర్పాటుపై టీడీపీ నాయకులు గగ్గోలు...

ఏపీలో సిట్‌ చిచ్చు రాజుకుంది. రాజకీయ దుమారం రేపుతోంది. అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సిట్ ఏర్పాటుపై టీడీపీ నాయకులు గగ్గోలు పెడుతుండగా.. నిజాలు నిగ్గు తేల్చేందుకే అని వైసీపీ నాయకులు చెబుతున్నారు. తమ పారదర్శక పాలనకు ఇదో మచ్చు తునక అంటున్నారు.

గత ఐదేళ్ల పాలనపై సిట్ ఏర్పాటు అంశం.. ఏపీ రాజకీయాల్లో రచ్చగా మారింది. టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తుందునే ప్రతిపక్ష నాయకులను టార్గెట్ చేస్తున్నారని.. ఆరోపిస్తున్నారు. అయితే ఐదేళ్ల పాలనపై సిట్ వేయడం.. దేశంలో ఎక్కడా లేదని.. మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు అన్నారు. ఏదో ఒక ఘటనపైనో.. లేక ప్రభుత్వ నిర్ణయంపైనో సిట్ వేస్తారని.. అసలు పోలీస్‌ అధికారులతో సిట్ వేయడమేంటని ప్రశ్నించారు. గతంలో సీఎస్‌గా పనిచేసిన అజయ్ కళ్లంను కూడా ఈ సిట్ విచారిస్తుందా అని నక్కా ఆనంద్‌బాబు ప్రశ్నించారు.

అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని ప్రభుత్వం ఈ విషయం గతంలోనే చెప్పిందంటూ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. అందులో భాగంగానే ఆధారాలు వెలికితీసేందుకే సిట్ ఏర్పాటు చేశామన్నారు. ఎంక్వైరీ చేయండి.తప్పు చేస్తే శిక్షించండి. సీబీఐకి అప్పగించండి అని అన్న ప్రతిపక్ష నాయకులు సిట్‌ వేస్తే ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ఇదెక్కడి రాజకీయం అని బొత్స ప్రతిపక్ష నాయకులను ప్రశ్నించారు. అవకతవకలపై విచారణ చేయడం కక్ష సాధింపు చర్య ఎలా అవుతుందని బొత్స ప్రశ్నించారు.

మరోవైపు సిట్‌ వేస్తే ఎందుకు భయపడుతున్నారని.. మంత్రి పార్థసారధి ప్రతిపక్ష నాయకులను ప్రశ్నిస్తున్నా,రు. ఇలాంటి విచారణలు జరుగుతాయనే చంద్రబాబు సీబీఐని రాష్ట్రంలోకి రానివ్వకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు పాత్రపై కూడా విచారించాలని సిట్‌ను కోరుతున్నట్లు తెలిపారు.

ఏర్పాటుతోనే రాజకీయ రచ్చ చేస్తున్న సిట్.. ముందు ముందు మరెన్ని విషయాలు బయటపెడుతుందో అన్నది వేచిచూడాలి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories