బాయిలర్ కోళ్లకు V.V.N.B వైరస్

బాయిలర్ కోళ్లకు V.V.N.B వైరస్
x
Highlights

V.V.N.B వైరస్ బాయిలర్ కోళ్లకూ సోకింది. ఇప్పటి వరకు గుడ్లు పెట్టే కోళ్లకు సోకే ఈ వైరస్ తాజాగా బాయిలర్ కోళ్లకు పాకింది. తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు...

V.V.N.B వైరస్ బాయిలర్ కోళ్లకూ సోకింది. ఇప్పటి వరకు గుడ్లు పెట్టే కోళ్లకు సోకే ఈ వైరస్ తాజాగా బాయిలర్ కోళ్లకు పాకింది. తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండల బడుగువాని లంక గ్రామానికి చెందిన ఓ రైతు ఫారంలో రెండు రోజుల్లో 2వేల 50 బాయిలర్ కోళ్లు V.V.N.B వైరస్‌తో మృతి చెందాయి. ఫారంలో ఇంకా 250 కోళ్లు మాత్రమే మిగిలాయి.

కోళ్ల మృతితో ఆరు లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు వెల్లడించాడు. చనిపోయిన కోళ్లను మూటలు కట్టి దూరంగా తీసుకెళ్లి పాతి పెడుతున్నట్లు చెప్పారు. V.V.N.B వైరస్‌ విస్తరిస్తుండటంతో కోళ్ల ఫారం నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే చికెన్ తింటున్న మాంసం ప్రియులు తమకెలాంటి అనారోగ్యం వస్తుందేమోనని భయపడుతున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories