కోళ్లకు వైరస్.. చికెన్ తినేందుకు వణుకుతున్న జనం

కోళ్లకు వైరస్.. చికెన్ తినేందుకు వణుకుతున్న జనం
x
కోళ్లకు వైరస్.. చికెన్ తినేందుకు వణుకుతున్న జనం
Highlights

చికెన్ ఈ పేరు వింటేనే మాంసంప్రియులకు నోరూరుతుంది. సామాన్యుడైనా వారానికోసారైనా చికెన్‌ తింటుంటాడు. సాధారణ ప్రజల నుంచి సంపన్నుల వరకు ఇష్టపడే చికెన్‌...

చికెన్ ఈ పేరు వింటేనే మాంసంప్రియులకు నోరూరుతుంది. సామాన్యుడైనా వారానికోసారైనా చికెన్‌ తింటుంటాడు. సాధారణ ప్రజల నుంచి సంపన్నుల వరకు ఇష్టపడే చికెన్‌ తినేందుకు ఇప్పుడు ఎందుకు భయపడుతున్నారు...?

కోవిడ్ 19 వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తుంటే V.V.N.B వైరస్ ఉభయ గోదావరి జిల్లావాసులను భయపెడుతోంది. తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం బడుగువాని గ్రామంలో ఓ రైతు కోళ్ల ఫారంలో 2వేల 50 కోళ్లు V.V.N.B వైరస్‌తో చనిపోవడమే ఇందుకు ప్రధాన కారణం.

బ్రాయిలర్ కోళ్లకు V.V.N.B వైరస్ సోకుతుండటంతో పౌల్ట్రీ రైతులు ఆందోళన చెందుతున్నారు. చనిపోతున్న కోళ్లను మూటలు కట్టి భూమిలో పాతి పెడుతున్నారు. కొందరు చనిపోయిన కోళ్లను చేపల మేత కోసం తక్కువ ధరకే అమ్మేస్తున్నారు.

V.V.N.B వైరస్ ఎఫెక్ట్‌తో చికెన్ అమ్మకాలు పడిపోతున్నాయి. జనం లేక చికెన్ మార్కెట్లు వెలవెల పోతున్నాయి. చికెన్‌తో పాటు గుడ్ల ధరలు పడిపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో చికెన్ తినడమే మానేస్తున్నారు. చికెన్ తింటే ఆ వైరస్ తమకు ఎక్కడ సోకుతుందేమోనని భయపడుతున్నారు. వైరస్‌ ప్రచారంతో తమ వ్యాపారాలు పూర్తిగా పడిపోయాయని చికెన్ షాప్ యజమానులంటున్నారు. వైద్యులు కూడా చికెన్‌తో పాటు గుడ్లు తినకపోవడమే మంచిదని సూచిస్తున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories