కోడెల చనిపోవడానికి కారణం ఇదే : ఉండవల్లి అరుణకుమార్

కోడెల చనిపోవడానికి కారణం ఇదే : ఉండవల్లి అరుణకుమార్
x
Highlights

ఇటీవల ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.. వైసీపీ ప్రభుత్వం వేధింపుల వల్లే కోడెల ఆత్మహత్య...

ఇటీవల ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.. వైసీపీ ప్రభుత్వం వేధింపుల వల్లే కోడెల ఆత్మహత్య చేసుకున్నారని టీడీపీ ఆరోపిస్తుంటే.. టీడీపీ నిరాదరణ కారణంగానే కోడెల ఆత్మహత్య చేసుకున్నారని ఇటు వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. అయితే పరస్పర ఆరోపణలపై మాజీఎంపీ ఉండవల్లి అరుణకుమార్ స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో ఉండవల్లి మాట్లాడుతూ.. కోడెల శివప్రసాద్ రావు చాలా అగ్రెసివ్ పొలిటీషియన్, ఎన్టీఆర్ ను పదవి నుంచి తొలగించిన సమయంలో పోలీస్ స్టేషన్ మీద దాడి చేశారు..

ఆయన ఇంట్లో ఒకానొక సమయంలో బాంబులు కూడా పేలాయి.. ఆయనొక మంచి ప్రాక్టీస్ ఉన్న డాక్టర్.. అలాంటి వ్యక్తి జగన్ తిట్టాడనో అరుణకుమార్ తిట్టాడనో ఆత్మహత్య చేసుకోరు.. అలాంటివారు ఎప్పుడూ కూడా శత్రువుతో తలపడతారు కానీ శత్రువుకు బయపడి ఆత్మహత్య చేసుకోరు.. కానీ ఎవరో ఒకరు దగ్గరివాళ్ల నుంచి ఆయనకు తీవ్రమైన అవమానం జరిగింది. ఈ క్రమంలోనే ఇక జీవితం ఎందుకని అనుకోని ఉండి ఉండొచ్చు.. అందుకే కోడెల శివప్రసాద్ రావు బలవన్మరణానికి పాల్పడి ఉంటారన్న అభిప్రాయాన్ని ఉండవల్లి వ్యక్తం చేశారు.

కాగా కోడెల శివప్రసాద్ రావు హైదరాబాద్‌లోని తన నివాసంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.. సెప్టెంబర్ 16 న ఉదయం 11 గంటల సమయంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఆయన్ను కుటుంబసభ్యులు హుటాహుటిన బసవతారకం ఆస్పత్రికి తరలించినప్పటికీ.. అప్పటికే ఆయన చనిపోయినట్టుగా అక్కడి వైద్యులు దృవీకరించారు. ఆరుసారు ఎమ్మెల్యేగా గెలిచిన కోడెల.. ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు కేబినెట్‌లో పలు శాఖలకు మంత్రిగా సేవలందించారు. 1983 నుంచి 2004 వరకు ఐదుసార్లు గుంటూరు జిల్లా నరసారావుపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కోడెల శివ ప్రసాద్ రావు.. 2014 ఎన్నికల్లో అదే జిల్లాలోని సత్తెనపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories