అందుకే వైసీపీ హాజరుకావడం లేదు : మాజీ ఉండవల్లి

అందుకే వైసీపీ హాజరుకావడం లేదు : మాజీ ఉండవల్లి
x
Highlights

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో విజయవాడలోని ఐలాపురంహోటల్ లో అఖిలపక్షం, మేధావుల సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ప్రత్యేక హోదా, విభజన హామీలు,...

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో విజయవాడలోని ఐలాపురంహోటల్ లో అఖిలపక్షం, మేధావుల సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ప్రత్యేక హోదా, విభజన హామీలు, రాష్ట్రానికి కేంద్రం నిధులు ఇవ్వకపోవడం తదితర అంశాలపై అఖిలపక్షం చర్చించనుంది. అయితే ఇంతకుముందు ఈ అఖిలపక్ష సమావేశానికి రావలసిందిగా అన్ని పార్టీలకు ఉండవల్లి లేఖలు రాశారు.

ఈ లేఖపై టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ఉండవల్లి నిర్వహిస్తున్న సమావేశానికి హాజరు కావాలని నిర్ణయించారు. ఈ భేటీకి రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్, మంత్రి నక్కా ఆనందబాబులు హాజరవుతున్నారు.

మరోవైపు టీడీపీతో కలసి ఒకే వేదికను పంచుకోలేమని.. అందువల్ల ఈ భేటీకి హాజరుకాలేమని వైసీపీ ప్రకటించింది. ఈ విషయాన్నీ ఉండవల్లి చెప్పారు. మిగిలిన పార్టీలన్నీ హాజరవుతున్నట్టుగా ఆయన తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories