కుక్కకు ఓటు హక్కు.. ఇదీ మన అధికారుల పనితీరు అంటూ సెటైర్లు !

కుక్కకు ఓటు హక్కు.. ఇదీ మన అధికారుల పనితీరు అంటూ సెటైర్లు !
x
కుక్కకు ఓటు హక్కు
Highlights

కుక్క కూడా ఓటు వేయబోతోంది, పోలింగ్ బూత్‌లోకి వెళ్లి తనకూ ఓటు హక్కు ఉందని ఓటర్ లిస్ట్‌లో తన ఫొటో చూపించి మరీ ఓటు హక్కును వినియోగించుకోబోంది. కుక్కకు...

కుక్క కూడా ఓటు వేయబోతోంది, పోలింగ్ బూత్‌లోకి వెళ్లి తనకూ ఓటు హక్కు ఉందని ఓటర్ లిస్ట్‌లో తన ఫొటో చూపించి మరీ ఓటు హక్కును వినియోగించుకోబోంది. కుక్కకు ఓటా అని నోరెళ్ల బెడుతున్నారా? మీరు వింటున్నది నిజమే మరి కుక్కకు ఓటు ‍హక్కు కల్పించిన ఆ ప్రభుద్దులు ఎవరనే కదా మీ సందేహం, పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నగరపాలక సంస్ద అధికారులు చేసిన నిర్వాకం ఇదీ, ఇంతకీ కుక్కకు ఓటు ఏంటో? అధికారులు చేసిన నిర్వాకమేంటో మీరే చూడండి.

స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఏలూరు నగర పాలక సంస్థ విడుదల చేసిన ఫైనల్ ఓటర్ లిస్టును చూసినవాళ్లు ఇదేం విడ్డూరమంటూ నవ్వుకుంటున్నారు. మన అధికారుల పనితీరు భలేగుందంటూ సెటైర్లు వేస్తున్నారు. ఎందుకంటే, కుక్కకు ఓటు హక్కు కల్పించిన ఘనత ఏలూరు అధికారులకు దక్కింది.

ఏలూరు 12వ డివిజన్లో యువకుడు బన్నీ గారకు కొత్తగా ఓటు హక్కు వచ్చింది. సీరియల్ నెంబర్ 5928తో పోలింగ్ స్టేషన్ నెంబర్ 194లో ఓటు ఉన్నట్లు చూపించారు. అయితే, ఓటర్ల జాబితాలో బన్నీ గారకు బదులుగా అతని స్థానంలో కుక్క బొమ్మను ముద్రించారు. దాంతో, మన అధికారులు కుక్కకు కూడా ఓటు హక్కు కల్పించారంటూ జనం ముక్కున వేలేసుకుంటున్నారు.

కుక్కకు ఓటు హక్కు కల్పించడమే కాదు అదే డివిజన్‌లో ఎప్పుడో మరణించిన బాలకృష్ణకాశీకి రెండు సీరియల్ నెంబర్లతో రెండు పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కు కల్పించారు. అలాగే, 13వ డివిజన్‌లో మహిళా ఓటరు వల్లూరి అరుణకు ఏకంగా ఏడు చోట్ల ఓటు హక్కు కల్పించి ఏలూరు నగర పాలక సంస్థ అధికారులు తమ పనితనాన్ని నిరూపించుకున్నారు. ఇలా, ఒకటి కాదు రెండు కాదు ఓటర్ లిస్ట్ మొత్తం తప్పులతడకగా రూపొందించి ఆయా పార్టీలకు పంపారు. అయితే, ఓటర్ లిస్టులో కుక్క బొమ్మ అలాగే ఒక్కరికి ఏడేసి ఓట్లు ఉండటాన్ని చూసి రాజకీయ నేతలతోపాటు ప్రజలు కూడా నోరెళ్ల బెడుతున్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories