ఒంటిమిట్ట‌లో కోదండ రాముని క‌ళ్యాణం.. టీటీడీలో ప్ర‌త్య‌క్ష‌ప్ర‌సారం

ఒంటిమిట్ట‌లో కోదండ రాముని క‌ళ్యాణం.. టీటీడీలో ప్ర‌త్య‌క్ష‌ప్ర‌సారం
x
Highlights

రాష్ట్రంలోని ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్ర‌మైన క‌డ‌ప జిల్లాలోని ఒంటిమిట్ట కోదండ రామాల‌యంలో ఈ రోజు సాయంత్రం సితారాముల క‌ళ్యాణం జ‌ర‌గ‌నుంది. ఈ రోజు (...

రాష్ట్రంలోని ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్ర‌మైన క‌డ‌ప జిల్లాలోని ఒంటిమిట్ట కోదండ రామాల‌యంలో ఈ రోజు సాయంత్రం సితారాముల క‌ళ్యాణం జ‌ర‌గ‌నుంది. ఈ రోజు ( మంగ‌ళ‌వారం) రాత్రి ఏడు గంట‌ల నుంచి రాత్రి తొమ్మిది గంట‌ల వ‌ర‌కు ఆల‌య ప్రాంగ‌ణంలో క‌ల్యాణ మండ‌పంలో ఏకాంతంగా నిర్వ‌హించ‌నున్నారు. సీతారాముల కల్యాణ మహోత్సవ ఘట్టాన్ని... ఆగమశాస్త్ర ప్రకారం దేవాలయంలోని గర్భగుడి వెనుక భాగంలో ఉన్న కల్యాణమండలంలో నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు.

లాక్ డౌన్ నేప‌థ్యంలో భ‌క్తులు ఎవ‌రూ దేవాల‌యానికి రావ‌ద్ద‌ని టీటీడీ అధికారులు కూడా విజ్ఞప్తి చేశారు. స్వామివారి క‌ళ్యాణాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించేందుకు భ‌క్తుల‌కు అవకాశం కల్పించారు. భక్తుల తమ ఇళ్ల‌ నుంచే స్వామి వారి కల్యాణాన్ని ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం ద్వారా చూడొచ్చని ఆలయ అధికారులు తెలిపారు. స్వామి వారి క‌ళ్యాణాన్ని టీటీడీ భ‌క్తి చాన‌ల్ ఎస్వీబీసీలో ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేయ‌నున్నారు.

ఇక్క‌డ కొదండ‌రాముని బ్ర‌హ్మెత్స‌వాలు నిర్వ‌హిస్తారు. ఒంటి మిట్ట‌లో స్వామి వారి కళ్యాణం నిర్వ‌హిస్తారు. శ్రీరామనవమి రోజున ప్రభుత్వం పట్టు వస్త్రాలను, తలంబ్రాలను సమర్పించి, ప్రత్యేక కార్యక్రమాలనూ నిర్వహిస్తారు.చైత్ర శుధ్ధ నవమి నుంచి బహుళ విదియ వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అందులో చతుర్దశినాడు కళ్యాణం, పౌర్ణమినాడు రధోత్సవం, నవమినాడు పోతన జయంతి జరుగుతాయి. రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం భ‌ద్రాచ‌లం త‌ర్వాత ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఈ ఆలయాల‌న్ని ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే


Show Full Article
Print Article
More On
Next Story
More Stories