జగన్ సర్కార్‌కు వాలంటీర్లు షాక్‌

Volunteers shock to Jagan Sarkar
x

ఆంధ్రప్రదేశ్ వాలంటీర్లు

Highlights

* జీతం పెంచాలని రోడ్డెక్కిన వాలంటీర్లు * ఎన్నికల వేళ హ్యాండ్‌ ఇచ్చిన వాలంటీర్లు * 2019లో వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు

ఎన్నికల వేళ ఏపీ వాలంటీర్లు ప్రభుత్వానికి హ్యాండ్‌ ఇచ్చారు. జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ రోడ్డెక్కారు. ఓ పక్క ఎన్నికలు. మరోపక్క వాలంటీర్ల డిమాండ్లు మొత్తానికి జగన్‌ ప్రభుత్వానికి కొత్త తలనొప్పి మొదలైంది. మరీ వాలంటీర్లను జగన్‌ సర్కార్‌ ఎలా బుజ్జగించనుంది.? వాలంటీర్లు వెనక్కు తగ్గుతారా? ఇదే సమయంలో వాలంటీర్లకు సీఎం బహిరంగ లేఖ రాశారు గ్రామ, వార్డు వాలంటీర్లకు ఇస్తున్నది జీతం కాదని గౌరవ భృతి అని సీఎం లేఖలో పేర్కొన్నారు.

ఒకపక్కన పంచాయతీ ఎన్నికలు మరోపక్కన వాలంటీర్ల డిమాండ్లు.. ఇంకొవైపు కరోనా వ్యాక్సినేషన్.. వీటన్నింటితో ఏపీ సర్కార్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఏపీలో ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేసేందుకు వైసీపీ సర్కారు 2019లో వాలంటీర్‌ వ్యవస్థను తీసుకువచ్చింది. వాలంటీర్లు ఏడాదిన్నరకే ప్రభుత్వానికి షాక్‌ ఇచ్చారు. 5వేల రూపాయల గౌరవ వేతనంతో వీరిని ప్రభుత్వం నియమించింది. ఇప్పుడు దాన్ని రూ.12 వేలకు పెంచాలంటూ వాలంటీర్లు రోడ్లపై ఆందోళనలు చేస్తున్నారు. నిజానికి 5వేల జీతంతో నెట్టుకురావడం కష్టమే. కానీ మధ్యలో జీతాలు పెంచుతామని ప్రభుత్వం హామీ ఇవ్వలేదు. అయితే

ఎన్నికల వేళ వాలంటీర్లు సంయమనం పాటించాలని ప్రభుత్వం సూచిస్తోంది. కానీ వాలంటీర్లు మాత్రం.. జీతాలు పెంచాల్సిందే అంటూ రెడ్డెక్కారు. ఏపీ వాలంటీర్లకు జీతంతోపాటు మరెన్నో సమస్యలు వెంటాడుతున్నాయి. నిర్ణీత పని వేళలు లేకపోవడం, జనం వేధింపులు పెరుగుతుండటం కూడా సమస్యగా మారుతోంది. ఏ పథకం ఎవరికి అందకపోయినా వారి నుంచి వాలంటీర్లకు ఛీత్కారాలు ఎదురవుతున్నాయి.

అయితే సీఎం జగన్ వాలంటీర్లకు బహిరంగ లేఖ రాశారు. వాలంటీర్లకు ఇస్తున్నది జీతం కాదని.. గౌరవ భృతి అని సీఎం లేఖలో పేర్కొన్నారు. ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా ఉండేందుకు గౌరవభృతి ఇస్తున్నట్టు తెలిపారు. లంచాలు, వివక్ష లేని వ్యవస్థ కోసమే వాలంటీర్ల నియామకం చేపట్టినట్లు చెప్పారు. వాస్తవాలతో నిమిత్తం లేకుండా వాలంటీర్లు రోడ్డెక్కడం బాధించిందని లేఖలో పేర్కొన్నారు.

వాలంటీర్ల వ్యవస్థను లేకుండా చేయాలన్న దురాలోచనలతో కొందరు కుట్రలు పన్నుతున్నారని సీఎం తెలిపారు. ప్రలోభాలకు గురి కాకుండా, వాటికి దూరంగా ఉంటూ కర్తవ్యాన్ని నిర్వహించాలని మీ శ్రేయోభిలాషిగా విజ్ఞప్తి చేశారు. అత్యుత్తమ సేవల అందించిన వారికి నియోజకవర్గాల ప్రాతిపదికన ఏటా ఒక రోజున మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్లర్లు, ఎస్పీ సమక్షంలో శాలువా కప్పి అవార్డు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోందని సీఎం లేఖలో పేర్కొన్నారు.

వైసీపీ ప్రభుత్వం ఓ వైపు పంచాయతీ ఎన్నికలను ఎదుర్కొంటోంది. మరోవైపు త్వరలో పురపాలక, ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోరు మొదలవుతుంది. ఇలాంటి కీలక సమయంలో జగన్‌ సర్కార్‌కు వాలంటీర్లు హ్యాండ్‌ ఇచ్చారు. వారిని బుజ్జగించేందుకు సీఎం లేఖ రాశారు.. ఇప్పుడు వాలంటీర్లు ఏ స్టాండ్ తీసుకుంటారో చూడాలి.


Show Full Article
Print Article
Next Story
More Stories