నేడు విధుల్లోకి వలంటీర్లు.. చేయవలసిన పనులు ఇవే..

నేడు విధుల్లోకి వలంటీర్లు.. చేయవలసిన పనులు ఇవే..
x
Highlights

నేటినుంచి ఏపీ ప్రభుత్వం నూతన చరితకు శ్రీకారం చుడుతుంది. బాపూజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యంలో భాగంగా గ్రామాల్లో ఉన్న పంచాయితీ రాజ్ వ్యవస్థను బలోపేతం...

నేటినుంచి ఏపీ ప్రభుత్వం నూతన చరితకు శ్రీకారం చుడుతుంది. బాపూజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యంలో భాగంగా గ్రామాల్లో ఉన్న పంచాయితీ రాజ్ వ్యవస్థను బలోపేతం చేస్తోంది. అందులో భాగంగా గ్రామ, పట్టణ వార్డుల్లో 2,66,796 మంది వలంటీర్లను ఎంపిక చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో 1,93,421 మంది, పట్టణ ప్రాంతాల్లో 73,375 మంది వలంటీర్లను ఎంపిక చేసింది ప్రభుత్వం. గ్రామీణ ప్రాంతంలో ప్రతి 50 ఇళ్లకు. గిరిజన ప్రాంతాల్లో ప్రతి 35 ఇళ్లకు, పట్టణ ప్రాంతాల్లో ప్రతి 50–100 ఇళ్లకు ఒకరు చొప్పున వలంటీర్లను నియమించింది. వీరంతా నేటినుంచి విధుల్లో చేరతారు. విజయవాడలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతులమీదుగా ఈ వ్యవస్థ ప్రారంభం కానుంది. అలాగే జిల్లాల్లో మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. 2.66 లక్షల మంది వలంటీర్లలో 1.33 లక్షల పోస్టులు మహిళలకు దక్కగా.. 50 శాతం రిజర్వేషన్ల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీలను ఎంపిక చేశారు.

చేయవలసిన పనులు

ప్రతి వాలంటీర్ కు నిర్దేశించబడిన 50 ఇళ్ల ప్రజల పూర్తి సమాచారాన్ని అతను సేకరించాలి. సర్వే ఆధారంగా వ్యక్తిగత, సామాజిక అవసరాలను గుర్తించి వారికీ ఏం కావాలో ప్రణాళికలో పొందుపరచాలి. రోడ్లు, వీధి దీపాలు, మురుగునీటి పారుదల సంబంధిత అంశాలపై ఎప్పటికప్పుడు సమీక్షించాలి. తాగునీరు , పారిశుధ్యం, పరిసరాల పరిశుభ్రత, ప్రాథమిక విద్యల సమాచారాన్ని మానిటరింగ్ చేయాలి. మద్యపాన నిషేధం, బాల్య వివాహాలు రూపుమాపటానికి తగిన సహాయ సహకారాలు అందించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించాలి. అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలను డోర్ డెలివరీ చేయాలి. కుల, మత, వర్గ, లింగ, రాజకీయ భేదాలకతీతంగా అర్హత కలిగిన ప్రతిఒక్కరికి ప్రభుత్వ పథకాలను చేరవేయాలి. అలాగే వారంలో ప్రతి సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహించాలి. ఇందులో ప్రజల ఫిర్యాదుల పరిష్కారానికి గ్రామ పంచాయతీ కార్యదర్శులతో సమన్వయం చేసుకుని లబ్ధిదారుల దరఖాస్తులను ఆయా కార్యదర్శులకు అందజేయాలి. అప్పుడప్పుడు గ్రామ సచివాలయంలో మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శి నిర్వహించే సమావేశాలకు హాజరు కావాలి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories