ఎమ్మెల్యే చిట్టిబాబు అకస్మిక తనిఖీలో అడ్డంగా దొరికిపోయిన వాలంటీర్లు

ఎమ్మెల్యే చిట్టిబాబు అకస్మిక తనిఖీలో అడ్డంగా దొరికిపోయిన వాలంటీర్లు
x
ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు, పంచాయతీ కార్యదర్శి ఎస్ బి శర్మ మరియు వాలంటీర్లు
Highlights

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నియమించిన వాలంటీర్లు అప్పుడే వారి వారి విధులకు డుమ్మా కొట్టడం మొదలుపెట్టారు.

అంబాజీపేట: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నియమించిన వాలంటీర్లు అప్పుడే వారి వారి విధులకు డుమ్మా కొట్టడం మొదలుపెట్టారు. సాక్షాత్తు పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ఆకస్మిక తనిఖీ చేయడంతో అడ్డంగా దొరికిపోయారు. ఇందుకు సంబంధించి వివరాల్లోకెళ్తే మాచవరం పంచాయతీ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే వాలంటీర్ల పనితీరును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో చాలా మంది వాలంటీర్లు విధులకు డుమ్మా కొట్టినట్లు తేటతెల్లమైంది.10 గంటలు దాటినప్పటికీ చాలామంది వాలంటీర్లు హాజరుకాకపోవడం హాజరు పట్టీలో సంతకాలు చేయకపోవడం ఎం.ఎల్.ఎ. గమనించారు. ఎమ్మెల్యే వచ్చారన్న సమాచారాన్ని తెలుసుకొన్న, డుమ్మా కొట్టిన వాలంటీర్లు ఆదరాబాదరాగా పంచాయతీకి రావడంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. అంకితభావంతో పనిచేస్తామనే వాలంటీర్లు మాత్రమే ఉండండి... లేకుంటే రాజీనామా చేసి వెళ్ళిపొండి అంటూ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.

హాజరైన వాలంటీర్లతో ఎమ్మెల్యే మాట్లాడుతూ... కొంత మంది వాలంటీర్లు తమకు అప్పగించిన విధులను నిర్వహించకుండా ఇళ్ల వద్దే కూర్చుని కాలక్షేపం చేస్తున్నారని తన దృష్టికి వచ్చిందన్నారు. నిర్వహణలో భాగంగా కొంత మంది వాలంటీర్లు లబ్ధిదారుల వద్ద సరిగా వివరాలు నమోదు చేసుకోవడం లేదని, వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని, నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నట్లు తెలిసిందన్నారు.

వారికి అప్పగించిన 50 కుటుంబాల సమగ్ర వివరాలను ఒక్క అక్షరం పొల్లు పోకుండా సేకరించి, పూర్తి సమాచారాన్ని ప్రభుత్వం దగ్గర ఉంచాలని ఇందుకు అంకితభావంతో పనిచేయాలని, లేకుంటే తక్షణమే వెళ్లిపోవాలని మరోసారి హెచ్చరించారు. పంచాయతీ కార్యదర్శి ఎస్ బి శర్మ తో మాట్లాడుతూ వాలంటీర్ల హాజరు పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని, ఎప్పటికప్పుడు సమాచారాన్ని తమ దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories