ఢిల్లీని తాకిన విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ సెగ

Vizag Steel Plant Issue
x

విశాఖపట్నం  స్టీల్ ప్లాంట్ 

Highlights

* హస్తినబాట పట్టిన ఏపీ బీజేపీ నేతల బృందం * ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్టీ పెద్దలపై ఒత్తిడి పెంచేందుకు వ్యూహం

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సాగుతున్న ఆందోళనల సెగ.. ఇప్పుడు ఢిల్లీని తాకింది. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్టీ పెద్దలపై ఒత్తిడి పెంచేందుకు వ్యూహం రచిస్తోంది ఏపీ బీజేపీ. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ విషయంపై చర్చించేందుకు ఇప్పటికే హస్తినబాట పట్టారు ఏపీ బీజేపీ నేతలు. కేంద్రమంత్రులు, పార్టీ పెద్దలతో భేటీ అయ్యేందుకు ఢిల్లీలో ప్రయత్నాలు చేస్తున్నారు.

నిన్న జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఏపీ బీజేపీ చీఫ్‌ సోము వీర్రాజుతో పాటు ఎమ్మెల్సీ మాధవ్‌, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు భేటీ అయ్యారు. ఇవాళ కేంద్రమంత్రులు, పార్టీ పెద్దలతో సమావేశం కానున్నారు నేతలు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో కూడా బీజేపీ నేతల బృందం భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. దీనికోసం రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నివాసంలో మంతనాలు కూడా జరుపుతున్నారు నేతలు.

Show Full Article
Print Article
Next Story
More Stories