Vizag Steel Plant: విశాఖ ఉక్కు ఉద్యమంలో కలకలం

Vizag Steel Plant Employee Srinivas Rao Missing After Writes Self Destruction Note
x

విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగి సూసైడ్ నోట్ 

Highlights

Vizag Steel Plant: గాజువాకకు చెందిన స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యోగి శ్రీనివాసరావు ఆత్మహత్య చేసుకుంటానని రాసిన లేఖ కలకలం రేపుతోంది

Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికుల పోరాటం కొనసాగుతోంది. వీరికి మద్దతుగా అనేక కార్మిక సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో సాయంత్రం మహాగర్జనకు సర్వం సిద్ధమైన వేళ.. శ్రీనివాసరావు అనే ప్లాంట్‌ ఉద్యోగి ఆత్మహత్య చేసుకుంటానంటూ రాసిన లేక కలకలం రేపింది. గాజువాకకు చెందిన శ్రీనివాసరాలు ఉక్కు ఫర్నేస్‌లో అగ్నికి ఆహుతవుతానంటూ రాసిన లేఖ లభ్యమైంది. ఈ లేఖపై పోలీసులు, కార్మికులు వివరాలు సేకరిస్తున్నారు. శ్రీనివాసరావు ఉదయం 5గంటల షిఫ్టుకు ప్లాంట్‌కు వెళ్లినట్టు తెలుస్తోంది.

అలాగే ఈ నెల 25 తర్వాత సమ్మెపై కార్మికులు నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇదే క్రమంలో స్టీల్ ప్లాంట్ ఉద్యోగి శ్రీనివాసరావు సూసైడ్ నోట్ కలకలంరేపుతోంది. తాను శనివారం సాయంత్రం 5.49 నిమిషాలకు అగ్నికి ఆహుతి కావాలని నిర్ణయించాను అన్నారు. అందరం కలిసికట్టుగా ఉంటేనే ఉద్యమంలో విజయం సాధిస్తామన్నారు. ఈ పోరాటం ప్రాణత్యాగం తన నుండి మొదలు కావాలి అన్నారు. ఉక్కు కార్మిక గర్జన ఒక మైలురాయిగా మొదలు కావాలన్నారు శ్రీనివాసరావు. 32మంది ప్రాణాల త్యాగమే ఉక్కు కర్మాగారం.. ఎట్టి పరిస్థితుల్లోనూ విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం కానివొద్దు అన్నారు. సూసైడ్ లేఖ రాసి పెట్టిన శ్రీనివాసరావు శనివారం ఉదయం నుంచి కనిపించకుండాపోయారు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories