Visakha Utsav 2019: విశాఖ ఉత్సవానికి సర్వం సిద్ధం

Visakha Utsav 2019: విశాఖ ఉత్సవానికి సర్వం సిద్ధం
x
Highlights

విశాఖ ఉత్సవాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి.

విశాఖ ఉత్సవాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం విశాఖ రామకృష్ణ బీచ్, వైయస్ఆర్ సెంట్రల్ పార్క్ లను సిద్ధం చేశారు. కార్నివాల్ కోసం విస్తృతమైన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఉత్సవాలపై జిల్లా అధికారులతో పర్యాటక శాఖ మంత్రి ముత్తశెట్టి శ్రీనివాసరావు సమీక్షాసమావేశం నిర్ణహించారు. వివిధ ప్రాంతాలనుంచి విశాఖ మహోత్సవానికి వచ్చే సందర్శకుల కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, విశాఖ ఉత్సవ్ కోసం సుమారు 2,500 మంది పోలీసు సిబ్బందిని నియమించారు. 24 కిలోమీటర్ల పొడవైన మానవహారం సమయంలో భద్రత కోసం వందలాది మంది పోలీసులు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు.

మానవహారంలో రాజకీయ నాయకులు పాల్గొనే అవకాశం ఉండటంతో వారికి రక్షణ కల్పించేందుకు ప్రత్యేక దళం సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. ప్రధాన వేదిక వద్ద 5 వేల మంది సందర్శకులకు సీటింగ్ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ వి వినయ్ చంద్ అధికారులను ఆదేశించారు. విమానాశ్రయం నుండి బీచ్ రోడ్ వరకు ప్రారంభమయ్యే మానవహారంలో ఉత్తరాంధ్ర నుండి వైయస్ఆర్సిపి కార్యకర్తలు మరియు స్వచ్ఛంద సేవకుల సైన్యం పాల్గొంటారని తెలిపారు. విశాఖపంటంలోని పోలీసు సిబ్బందితో పాటు, రెండు రోజుల కార్నివాల్ కోసం పొరుగు జిల్లాలైన విజయనగరం, శ్రీకాకుళం నుండి కూడా రప్పించారు. నగరంలో శాంతిభద్రతల నిర్వహణకు భద్రతా ఆంక్షలు అమల్లో ఉన్నాయని పోలీసులు ధృవీకరించారు.

మొదటగా మధ్యాహ్నం 3 గంటలకు కార్నివాల్ ప్రారంభం కానుంది. శాస్త్రీయ నృత్యం, లేజర్ షో, పాప్ సింగర్ అనుదీప్ ప్రత్యక్ష కచేరీ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ ప్రత్యక్ష ప్రదర్శన అలాగే యాంకర్ సుమ కనకాల ఈ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించనున్నారు. రెండవ రోజు, 'త్రీరీ' లైవ్ బ్యాండ్, ఆర్చరీ షో, సంగీత దర్శకుడు ఎస్.ఎస్.తమన్ కచేరీ, లేజర్ షో మరియు బాణసంచా ఉత్సవ్‌లో భాగంగా ఉన్నాయి. ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సాయంత్రం 6 గంటలకు వేదిక వద్దకు చేరుకుంటారు, కార్నివాల్ ముగింపు రోజు గవర్నర్ బిస్వ భూసన్ హరిచందన్ ముఖ్య అతిథిగా పాల్గొంటారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories