Viveka Murder Case: హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు.. సుప్రీం కోర్టుకు సునీత

Viveka Daughter Sunitha Filed Petition in Supreme Court
x

Viveka Murder Case: హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు.. సుప్రీం కోర్టుకు సునీత

Highlights

Viveka Murder Case: రేపు విచారణ చేపట్టనున్న సుప్రీంకోర్టు

Viveka Murder Case: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసు వ్యవహారంలో ఆయన కుమార్తె సునీతారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ సందర్భంగా... తెలంగాణ హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ సర్వోన్నత న్యాయస్థానంలో ఆమె పిటిషన్‌ దాఖలు చేశారు. ఈనెల 25 వరకు అవినాష్‌ను అరెస్ట్‌ చేయొద్దంటూ సీబీఐకి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే.

తాజాగా సుప్రీంలో సునీత దాఖలు చేసిన పిటిషన్‌ అంశాన్ని జస్టిస్‌ ఎంఆర్‌ షా ధర్మాసనం ఎదుట ఆమె తరఫు న్యాయవాదులు ప్రస్తావించారు. దీనిపై శుక్రవారం విచారణ చేపడతామని ధర్మాసనం పేర్కొంది.

అవినాష్‌ ఈనెల 25 వరకు ప్రతి రోజూ సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని తెలంగాణ హైకోర్టు షరతు విధించింది. ప్రశ్నలను రాతపూర్వకంగా ఇవ్వాలని.. విచారణను ఆడియో, వీడియో రికార్డు చేయాలని సీబీఐకి ఆదేశిస్తూ.. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 25న తుది ఉత్తర్వులు జారీ చేస్తామంటూ విచారణను వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో సునీత సుప్రీంను ఆశ్రయించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories