విశాఖ భూ కుంభకోణం.. భారీగా వినతులు

విశాఖ భూ కుంభకోణం.. భారీగా వినతులు
x
సిట్‌ సభ్యులు వై.వి.అనురాధ, భాస్కరరావు, ఎస్‌డీసీ, లైజన్‌ ఆఫీసర్‌ శేష శైలజ
Highlights

విశాఖ నగరం, పరిసర ప్రాంతాల్లో చోటుచేసుకున్న భూ అక్రమాలను తేల్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. సిట్...

విశాఖ నగరం, పరిసర ప్రాంతాల్లో చోటుచేసుకున్న భూ అక్రమాలను తేల్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. సిట్ బృందం నవంబర్ 1 నుంచి విశాఖలో పర్యటిస్తోంది. నిన్నటినుంచి దరఖాస్తుల స్వీకరణను ప్రారంభించింది. ఫిర్యాదుల కోసం మొత్తం 19 కౌంటర్లను ఏర్పాటు చేసింది. దాంతో మొదటిరోజు 79 వినతులు వచ్చాయి. ఇందులో సిట్‌కు 14, నాన్‌ సిట్‌కు 65 ఫిర్యాదులు అందినట్టు తెలుస్తోంది. తొలిరోజు సిట్‌ చైర్మన్‌ డాక్టర్‌ విజయ్‌కుమార్‌ హాజరుకాలేదు.

సిట్ బృందం ఈ నెల 7వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనుంది. రిటైర్డ్ ఐఏఎస్‌ అధికారులు.. డాక్టర్‌ విజయ్‌కుమార్, వైవీ అనురాధ, అలాగే రిటైర్డ్ న్యాయమూర్తి టి.భాస్కరరావులు ఇందులో సభ్యులుగా ఉన్నారు. కాగా విశాఖపట్నం రెవెన్యూ డివిజన్‌లోని ఆనందపురం, భీమునిపట్నం, పద్మనాభం, పెందుర్తి, పరవాడ, సబ్బవరం, గాజువాక, పెదగంట్యాడ, విశాఖపట్నం రూరల్, సీతమ్మధార, మహారాణిపేట, ములగాడ, గోపాలపట్నం మండలాల పరిధిలో భారీగా భూ అక్రమాలు చోటుచేసుకున్నట్టు ప్రభుత్వం గుర్తించింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories