విశాఖలో టీడీపీ నేతల సమావేశం.. సీఎం నిర్ణయాన్ని స్వాగతించాలని తీర్మానం..

విశాఖలో టీడీపీ నేతల సమావేశం.. సీఎం నిర్ణయాన్ని స్వాగతించాలని తీర్మానం..
x
Highlights

విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చెయ్యాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.

విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చెయ్యాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు అనుగుణంగానే GN రావు కమిటీ నివేదిక కూడా ఇచ్చింది. ఈ కమిటీ నివేదికను టీడీపీ వ్యతిరేకిస్తున్న తరుణంలో విశాఖలో సంచలన పరిణామం చోటుచేసుకుంది. తాజా రాజకీయ పరిణామాలు, రాజధానిపై చర్చించేందుకు విశాఖ టీడీపీ నేతలు నగరంలోని ఓ ఫైవ్ స్టార్‌ హోటల్లో సమావేశమయ్యారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, వాసుపల్లి గణేష్, గణబాబులతో పాటు పలువురు మాజీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

సమావేశంలో ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్ రావడాన్ని స్వాగతించారు. విశాఖ వాసులుగా ఎగ్జిక్యూటివ్‌ కేపిటల్‌ను స్వాగతించాల్సిన బాధ్యత తమపై ఉందని టీడీపీ నేతలు పేర్కొన్నారు. తరతరాలుగా ఉత్తరాంధ్ర నిర్లక్షానికి గురవుతోందని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెడితే తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అన్నారు. అదే సమయంలో అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతుల భవిష్యత్తు పైన ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని తీర్మానం చేశారు. తమ అభిప్రాయాన్ని టీడీపీ అధిష్టానానికి పంపిస్తామని వారంతా తెలిపారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories