కార్మికుడి అతితెలివి.. విశాఖ స్టీల్ ప్లాంట్లో దొంగతనం ఎలా చేశాడో..

కార్మికుడి అతితెలివి.. విశాఖ స్టీల్ ప్లాంట్లో దొంగతనం ఎలా చేశాడో..
x
Highlights

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ లో దొంగలు పడ్డారు.. అందిన కాడికి దోచుకుంటూనే ఉన్నారు. కొద్దీ రోజులుగా స్టీల్‌ప్లాంట్‌ సొత్తు దొంగల పాలు

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ లో దొంగలు పడ్డారు.. అందిన కాడికి దోచుకుంటూనే ఉన్నారు. కొద్దీ రోజులుగా స్టీల్‌ప్లాంట్‌ సొత్తు దొంగల పాలు అవుతూనే ఉంది. ఇది ప్లాంటులో వినబడుతున్న మాట. సీఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో ఎంత పటిష్టంగా నిఘా ఏర్పాటు చేసినా దొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు. అధికారుల కళ్లుగప్పి సొత్తును తరలిస్తూనే ఉన్నారు. ప్రహరీ గోడకు కన్నం పెట్టడం, గోడ లోపల నుంచి బయటకు చోరీ సొత్తును విసరడం, బైకు ట్యాంకు కింద ప్రత్యేక అమరిక ద్వారా సొత్తును తరలించడం వంటి పద్ధతుల్లో దొంగలు చోరీలు చేస్తుండేవారు. అయితే దీనికి బిన్నంగా ఆలోచించాడో దొంగ సీఐఎస్‌ఎఫ్‌ కళ్లుగప్పి ఏకంగా శరీరానికి చుట్టుకుని రాగిని తరలిస్తున్న ఓ వ్యక్తిని చాకచక్యంగా పట్టుకున్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ కోక్‌ ఓవెన్‌ ఐదో బ్యాటరీలో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్న నడుపూరుకు చెందిన జి.మన్మథరావు (49) సాయంత్రం 7 గంటల సమయంలో విధుల నుంచి బైక్‌పై వెళ్తున్నాడు. బీసీ గేటు వద్ద అనుమానం వచ్చి అతడిని తనిఖీ చేశారు.

దీంతో అతని దుస్తులు బలవంతంగా విప్పించారు. ఆరు కేజీల బరువు గల రాగి తీగను నడుముకు చుట్టుకోవడం చూసి సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది షాక్ కు గురయ్యారు. ఈ టైపు దొంగతనాలు ఎప్పటినుంచి జరుగుతున్నాయో? ఎంత సొత్తు దొంగల పాలు అయిందో అని తమని తాము ప్రశ్నించుకోవడం మొదలు పెట్టారు. నడుం మీద చుట్టుకొని రాగి వైరు మాత్రమే తరలించడం చూస్తే దీని వెనుక పెద్ద ముఠా ఉన్నట్టు వారికీ అనుమానం వచ్చింది. ప్లాంటులో సీసీ కెమెరాలు ఉన్నా కూడా విలువైన తీగలు, ఇతర వస్తువులు ఇలా విచిత్రంగా దొంగలపాలు అవుతుండడంపై అధికారులు సీరియస్ గా ద్రుష్టి సారించారు. దీంతో సమగ్ర దర్యాప్తు చేయడానికి సిద్ధమైంది. కాగా మన్మథరావును అదుపులోకి తీసుకుని స్టీల్‌ప్లాంట్‌ పోలీసులకు అప్పగించారు. అతని నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories