అర్ధరాత్రి ఇంట్లో నుంచి కేకలు, శబ్దాలు.. విశాఖలో ఓ కుటుంబం వింత చేష్టలు

X
Highlights
*అజామాబాద్ లో వెలుగుచూసిన ఘటన *గాజువాక పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు *బాధితులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చిన పోలీసులు
Samba Siva Rao1 Feb 2021 2:45 PM GMT
విశాఖలో ఓ కుటుంబం వింత చేష్టలతో స్థానికులు హడెలెత్తిపోయారు. అజామాబాద్ కు చెందిన కుటుంబ సభ్యులు నలుగురు ఇంటి లోపల గడియ పెట్టుకుని రాత్రంత పిచ్చి కేకలు, శబ్దాలు చేశారు. ఎంత పిలిచినా బయటకు రాలేదు. మదనపల్లిలో జరిగిన తరహాలో కుటుంబసభ్యులు వ్యవహరిస్తున్నారని స్థానికులు గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి ఇంటి తలుపులు పగులకొట్టి నలుగురు కుటుంబ సబ్యులను బయటకు తీసుకు వచ్చారు. ఇంటి పరిస్థితులు, కుటుంబ సభ్యుల మాటలు గమనిస్తే మానసికంగా ఒత్తిడికి గురినట్లు ఉన్నారని గాజువాక సీఐ మల్లేశ్వర్ రావు చెప్పారు. ఇంట్లో మాత్రం పూజకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లభించ లేదన్నారు. మదనపల్లి ఘటనతో పోలీక లేదని చెప్పారు. ఈ వ్యవహారంపై అధికారులకు సమాచారం అందించామని వెల్లడించారు.
Web TitleVisakhapatnam family behave strange and loud sounds
Next Story