నేవీ డే సెలిబ్రేషన్స్‌కు ముస్తాబైన విశాఖ సాగరతీరం

Visakhapatnam Beach Is Ready For Navy Day Celebrations
x

నేవీ డే సెలిబ్రేషన్స్‌కు ముస్తాబైన విశాఖ సాగరతీరం

Highlights

* ఇవాళ విశాఖ సాగరతీరాన నావికాదళ విన్యాసాల ప్రదర్శన

Navy Day: భారత నౌకాదళ దినోత్సవానికి ఇండియన్ నేవీ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా తీర ప్రాంతల్లోని ఓడరేవుల వద్ద నావికాదళ విన్యాసాలకు ఏర్పాట్లు పూర్తిచేసింది. విశాఖలో సముద్ర తీరాన ఇవాళ జరుగనున్న నేవీడే సెలిబ్రేషన్స్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొననున్నారు. వైజాగ్ తోపాటు, గుజరాత్ పోర్ బందర్ లో నేవీ విన్యాసాలు చేసేందుకు సర్వం సిద్ధం చేశారు. నేవీ డే సెలబ్రేషన్ లో భాగంగా, గుజరాత్ డామన్ & డయ్యూ నేవల్ ఏరియాలోని ఇండియన్ నేవల్ యూనిట్లు నేవీ వీక్-22 తమ పనితీరును పరీక్షించుకోనున్నాయి. ఇక ఈసారి నేవీ డే వేడుకల్లో నౌకాదళంలో అగ్నివీరులు పాల్గొంటున్నారు. త్రివిధ దళాల్లో నియామకాల కోసం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకం కింద భారత నౌకాదళంలోకి అగ్నివీరులను నియమించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories