
బన్నీ ఉత్సవం రక్తసిక్తం.. నలుగురి పరిస్థితి విషమం బన్నీ ఉత్సవం రక్తసిక్తం.. నలుగురి పరిస్థితి విషమం
విజయదశమి సందర్బంగా కర్నూల్ జిల్లా దేవరగట్టులో జరిగిన బన్నీ ఉత్సవం ఈ సారి కూడా రక్తసిక్తంగా మారింది. మాలమల్లేశ్వరుల విగ్రహాలను దక్కించుకునేందుకు 11 గ్రామాలు ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయి కర్రలతో దాడి చేసుకోవడంతో 50 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వీరారెడ్డి అనే వ్యక్తి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. గాయపడిని వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.
కాగా ఏటా దసరా పర్వదిననం రోజూన దేవరగట్టు కొండలో వెలసిన మల్లేశ్వర స్వామి కళ్యాణోత్సవం సందర్భంగా ఈ కర్రల యుద్ధం జరగడం ఆనవాయితీగా వస్తోంది. కొంతమంది కర్రలు, మరికొందరు దీవిటీలు చేతపట్టి ఆర్ధరాత్రి వేళ కొండల మధ్య నుంచి దేవేరుల విగ్రహాలతో కళ్యాణోత్సవానికి బయలుదేరుతారు. ఇదే సమయంలో ఉత్సవ విగ్రహాలను దక్కించుకునేందుకు పలు గ్రామాల ప్రజలు పోటీ పడతారు. ఆయా గ్రామాల ప్రజలు వర్గాలుగా విడిపోయి కర్రలతో తలపడతారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



