గుంటూరు జిల్లాలో ఉద్రిక్తత.. ఎక్సైజ్ అధికారులపై గ్రామస్తుల రాళ్ళ దాడి

గుంటూరు జిల్లాలో ఉద్రిక్తత.. ఎక్సైజ్ అధికారులపై గ్రామస్తుల రాళ్ళ దాడి
x
Highlights

గుంటూరు జిల్లా మాచర్ల ఎక్సైజ్ అధికారులపై గ్రామస్తుల దాడి చేశారు. ఈ ఘటన మాచర్ల మండలం హస్నాబాద్ తండాలో మంగళవారం చోటుచేసుకుంది.

గుంటూరు జిల్లా మాచర్ల ఎక్సైజ్ అధికారులపై గ్రామస్తుల దాడి చేశారు. ఈ ఘటన మాచర్ల మండలం హస్నాబాద్ తండాలో మంగళవారం చోటుచేసుకుంది. విజయపురి సౌత్ ఎస్ఐ పాల్ రవీందర్ కథనం ప్రకారం...హస్నాబాద్ తండాలో నాటుసారా అక్రమంగా తయారు చేస్తున్న బట్టి లపై దాడి చేసి 20 లీటర్ ల నాటుసారా స్వాధీన చేసుకున్నారు. దీనికి తోడు ఎక్సైజ్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు గత నెలలో అదే గ్రామంలో 7 వేల లీటర్ల బెల్లం ఊటను కూడా స్వాధీనం చేసుకున్నారు.

ఈ నేపథ్యంలో హస్నాబాద్ తండాపై పోలీసులు నిఘా ఉంచారు. కాగా.. పోలీసులు గ్రామాన్ని టార్గెట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు.. ఎక్సైజ్ అధికారులపై ఊహించని దాడి చేశారు. సుమారు 100 మంది వరకు గ్రామస్తులు గుమిగూడి పోలీసులపై దాడికి పాల్పడ్డారు.

అయితే వీరిలో సుమారు 15 మంది వ్యక్తులు రాళ్ళతో మాచర్ల ఎక్సైజ్ సి ఐ కొండారెడ్డి తో పాటు సిబ్బంది,కారుపై విరుచుకు పడ్డారు. దీనితో కొండారెడ్డి తో పాటు సిబ్బందికి గాయాలు కాగా కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. సమాచారం అందుకున్న విజయపురి సౌత్ ఎస్ ఐ హస్నాబాద్ తండా గ్రామానికి చేరుకొని సంఘటన స్థలాన్ని పరిశీలించారు.


HMTV లైవ్ వార్తలు ఎప్పటికప్పుడు గూగుల్ న్యూస్ లో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

Show Full Article
Print Article
More On
Next Story
More Stories