వెరైటీ డిజైన్‌లతో కనువిందు చేస్తున్న మట్టి ప్రమిదలు

వెరైటీ డిజైన్‌లతో కనువిందు చేస్తున్న మట్టి ప్రమిదలు
x
Highlights

దీపాల వరుసలో జరుపుకునే పండుగ దీపావళి. ప్రతి హిందువు ఈ పండుగను అత్యంత ఘనంగా, వైభవంగా.. భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. కానీ, ఈ సారి కరోనా కారణంగా కేవలం గ్రీన్ దివాళిని జరుపుకోవాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది.

దీపాల వరుసలో జరుపుకునే పండుగ దీపావళి. ప్రతి హిందువు ఈ పండుగను అత్యంత ఘనంగా, వైభవంగా.. భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. కానీ, ఈ సారి కరోనా కారణంగా కేవలం గ్రీన్ దివాళిని జరుపుకోవాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది. దాంతో ప్రతి ఒక్కరు తమ ఇంటిలో ప్రమీదలతో దీపావళి జరుపుకోవాలని అనుకుంటున్నారు. దీపావళి పండుగలో అత్యంత ముఖ్యమైనవి మట్టి ప్రమీదాలు. మట్టి ప్రమీదలపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం

దీపావళి.. సంప్రదాయం ప్రకారం జరుపుకోవాలని చాలా మంది సూచిస్తుంటారు. దాంతో పాటు ఈ ఏడాది చైనా వస్తువుల బ్యాన్ అని చేయాలని ప్రధాని మోడీ పిలుపును ప్రతి ఒక్కరు పాటిస్తున్నారు. దీంతో చైనా నుంచి దిగుమతి అయ్యే మైనం వొత్తులు మార్కెట్‌లో కనిపించడం లేదు.

విజయవాడలో చిన్న ప్రమీదల దగ్గర నుంచి పెద్ద ప్రమీదలు వరకు వివిధ రూపాల్లో దర్శనం ఇస్తున్నాయి. గతంలో కంటే ఎక్కువ మోడల్స్‌ను మార్కెట్‌లో ఉంచారు. కొనుగోలు దారులు కూడా డిజైన్‌లను కొంటున్నామని కొనుగోలు దారులు అంటున్నారు.

అయితే.. కరోనా ఎఫెక్ట్ తో తమకు బిజీనెస్ పెద్దగా లేదంటున్నారు వ్యాపారులు. కనీసం పెట్టుబడి కూడా రావటం లేదని వాపోతున్నారు. బ్యారాలు లేక తక్కువ ధరలకు విక్రయిస్తుంటే.. ఇంకా తక్కువ ధరకు అడుగుతున్నారు అంటున్నారు...

దీపావళి పండుగ సందర్భంగా చైనా వస్తువులు కట్టడి చేసిన ప్రమీదలకు అటు వ్యాపారుల నుంచి ఇటు కొనుగోలు దారుల వద్ద నుంచి మిశ్రమ స్పందన వస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories