విజయవాడ ప్రజలకు పోలీస్ కమిషనర్ హెచ్చరిక..

విజయవాడ ప్రజలకు పోలీస్ కమిషనర్ హెచ్చరిక..
x
Vijayawada Police Commissioner Dwarka Thirumalarao
Highlights

విజయవాడలో కరోనా వైరస్ వ్యాప్తిపై ఉదృతంగా ఉండటంతో నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు హెచ్చరికలు జారీ చేశారు.

విజయవాడలో కరోనా వైరస్ వ్యాప్తిపై ఉదృతంగా ఉండటంతో నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు హెచ్చరికలు జారీ చేశారు.కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కృష్ణ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు 70కి చేరుకున్నాయి. ఇవాళ ఒక్క రోజు 18 కరోనా కేసులు నమోదు కాగా..అందులో 16 కేసులు విజయవాడ నగరంలోనే నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.

ఈ నేపథ్యంలో విజయవాడలో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు అన్నారు. నగరంలో కొన్ని పాజిటివ్ కేసులు ఎలా వస్తున్నాయో అర్థం కావడం లేదని అన్నారు. ప్రజలను భయపెట్టడం తమ ఉద్దేశ్యం కాదని ఆయన తెలిపారు. మాకేం కాదనే ధీమాతో ప్రజలు గడప దాటి బయటకు రావొద్దని నగర కమిషనర్ విజ్ఞప్తి చేశారు.

ఇకపై ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి రోడ్డుపైకి వస్తే ఇక క్రిమినల్ కేసులు పెడతామని సీపీ ద్వారకా తిరుమలరావు హెచ్చరించారు. అనవసరంగా రోడ్ల మీదకు వచ్చి కేసుల్లో ఇరుక్కోవద్దని ఆయన సూచించారు. ఈ నెల 20 తరువాత కూడా పూర్తి స్థాయిలోనే విజయవాడలో లాక్ డౌన్ కొనసాగుతుందని పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు తెలిపారు.

కాగా.. ఇవాళ నగరంలో వెలుగు చూసిన 16 కరోనా పాజిటివ్ కేసుల్లో కార్మికనగర్‌లోనే ఎనిమిది కేసులు నమోదు కాగా,గుప్తా సెంటర్, గిరిపురం, ఖుద్దుస్ నగర్, విద్యాధరపురం, పటమట, కేదారేశ్వరపేట, కొత్తపేట, చోడవరం ప్రాంతాల్లో ఒక్కో కేసు వెలుగు చూసింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కరోనా బాధితుల నుంచి ఎవరికి వైరస్ సోకిందనే విషయంపై అధికారులు ఆరా తీసే పనిలోవున్నారు. వైరస్ సోకిన వారు నగరంలో ఎవరెవరిని కలిశారు. నగరంలో ఏఏ ప్రాంతాల్లో తిరిగారు అనే దానిపై అధికారులు విచారణ చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories