హాట్ హాట్ గా విజయవాడ మున్సిపల్ ఎన్నికలు...

Vijayawada Municipal Elections as Hot...
x

ఫైల్ ఇమేజ్


Highlights

Andhra Pradesh:విజయవాడలో మునిసిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఊహించని మలుపులు చోటు చేసుకుంటున్నాయి

Andhra ప్రదేశ్:విజయవాడలో మునిసిపల్ పాలిటిక్స్ హాట్ హాట్‌గా సాగుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఊహించని మలుపులు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ, టీడీపీ అభ్యర్ధులకు తలనొప్పులు తెస్తున్నాయి. అభ్యర్ధులను నిలబెట్టిన పార్టీలు... చివరి నిముషంలో నామినేషన్ మారుస్తుంటే.. కొందరు రెబల్స్‌గా అవతరిస్తున్నారు. బీ ఫారమ్ తీసుకుని మరీ పార్టీ మారిపోతున్నారు కొందరు. గరం గరంగా మారిపోతున్న విజయవాడ మునిసిపల్ పాలిటిక్స్‌పై హెచ్ ఎం టివి స్పెషల్ ఫోకస్ స్టోరీ‌‌‌‌....

మలుపులు తిరుగుతున్న విజయవాడ మున్సిపల్ ఎన్నికల..

మున్సిపల్ ఎన్నికలకు ముందు విజయవాడ రాజకీయాలు అనేక మలుపులు తిరుగుతున్నాయి. కౌన్సిలర్‌గా టికెట్‌ ఆశించినవారికి షాకులు తగులుతున్నాయి. పార్టీ అధిష్టానం వేరే విధంగా ఆలోచించడంతో టిక్కెట్లు ఆశిస్తున్నవారికి తీవ్ర నిరాశ ఎదురౌతోంది. విజయవాడ 28వ డివిజన్‌లో కాకు మల్లిఖార్జున యాదవ్ అంటే తెలీని వారుండరు.. టీడీపీ జెండాను నిత్యం మోసాడు..వరుసగా కార్పొరేటర్‌గా గెలుస్తూనే ఉన్నాడు... ఇప్పుడు కార్పొరేటర్ టికెట్టు వేరొకరికి ఇవ్వడంతో షాక్‌ తిన్నాడు.

బెజవాడ వైసీపీలో కూడా అసమ్మతి సెగ ..

బెజవాడ వైసీపీలో కూడా అసమ్మతి సెగ మొదలైంది. విజయవాడ సెంట్రల్ వైసీపీ కార్యాలయం ముందు పార్టీ కార్యకర్తలు ఆందోళన చేసారు. దివంగత నేత మహావిష్ణు భార్య సుధారాణికి బదులు జానారెడ్డికి పార్టీ టికెట్‌ కేటాయించడంతో వైసీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. తనకు టిక్కెట్ కేటాయించడం లేదని తెలియడంతో మహావిష్ణు భార్య సుధారాణి కన్నీరు మున్నీరు అయ్యారు. నిరంతరం సేవ చేస్తున్న తమకు సీటు ఇవ్వకపోవడం దారణమని వాపోయారు.

టూ తేలని రీతిలో రెబల్స్ ..

మున్నిపల్ ఎన్నికలకు ముందు బెజవాడలో రెండు ప్రధాన పార్టీల్లోనూ ఇలా ఎటూ తేలని రీతిలో రెబల్స్ పుట్టుకొస్తున్నారు. ఒకరు పబ్లిగ్గానే అసమ్మతి ప్రకటిస్తే‌.. మరొకరు చాటుగా అసమ్మతి ప్రకటిస్తున్నారు. బుడమేరు మధ్య కట్ట వద్ద డివిజన్‌లో కార్పొరేటర్‌గా గతంలో గెలిచి, డిప్యూటీ మేయర్ పదవి కూడా నెరపిన గోగుల రమణకే టీడీపీ టికెట్ ఇచ్చింది.. కానీ అతనికి టికెట్‌ ఇవ్వడం మాజీ ఎంఎల్ఏ బొండా ఉమకు నచ్చలేదని తెలుస్తోంది. ఆ ప్రాంతంలో ఇండిపెండెంట్‌గా బరిలో దిగుతున్న వ్యక్తికే బొండా మద్దతు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా ‌..‌‌ బెజవాడ పాలిటిక్స్‌లో... అది మునిసిపల్ అయినా.. జనరల్ అయినా.. హీట్ మాత్రం కామన్‌గా ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories