జగన్‌కు హ్యాపీ క్రిస్మస్.. కేశినేని సెటైరికల్ ట్వీట్

జగన్‌కు హ్యాపీ క్రిస్మస్.. కేశినేని సెటైరికల్ ట్వీట్
x
Highlights

రోజూ తన ట్వీట్లతో వైసీపీ సర్కారుపై విరుచుకుపడే విజయవాడ ఎంపీ కేశినేని నాని సీఎం జగన్ కు సెటైరికల్ గా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.

రోజూ తన ట్వీట్లతో వైసీపీ సర్కారుపై విరుచుకుపడే విజయవాడ ఎంపీ కేశినేని నాని సీఎం జగన్ కు సెటైరికల్ గా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. అందులో.. 'ఈ రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలను అనిశ్చితి లో పడేసిన జగన్ & గ్యాంగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కి ప్రత్యేకమైన క్రిస్టమస్ శుభాకాంక్షలు అని చెప్పారు. రాష్ట్రం ఏమి అయినా పర్వాలేదు మీరు మీ కుటుంబాలు సంతోషంగా ఉండాలని క్రిస్టమస్ సందర్భంగా భగవంతుడిని కోరుకోండి.' అంటూ పేర్కొన్నారు.

అంతేకాదు nrc పై సీఎం జగన్ చేసిన ప్రకటనపై కూడా వ్యంగంగా ట్వీట్ చేశారాయన. జగనన్న నువ్వు సూపర్ అంటూ.. కేసుల మాఫీ కోసం నీ ఎంపీలతో CAB కు అనుకూలంగా ఓటేపిస్తావు. ముస్లింల ఓట్ల కోసం NRC కి వ్యతిరేకమంటావు. ఏదయినా నీకే చెల్లిందన్న. హ్యాట్సాఫ్ అన్నా' అని nrc పై సీఎం తీసుకున్న నిర్ణయాన్ని కేశినేని నాని ఎద్దేవా చేశారు.




Show Full Article
Print Article
Next Story
More Stories