విజయవాడ దుర్గగుడి ఫ్లైఓవర్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ఈసారైనా!

విజయవాడ దుర్గగుడి ఫ్లైఓవర్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ఈసారైనా!
x
Highlights

విజయవాడ కనకదుర్గగుడి ఫ్లైఓవర్ ప్రారంభం కానుంది. ఈ విషయాన్నీ రాష్ట్రప్రభుత్వం వెల్లడించింది. ఈ ఫ్లైఓవర్ ను సీఎం వైఎస్‌ జగన్, కేంద్ర మంత్రి..

ఈ నెల 16న విజయవాడ కనకదుర్గగుడి ఫ్లైఓవర్ ప్రారంభం కానుంది. ఈ విషయాన్నీ రాష్ట్రప్రభుత్వం వెల్లడించింది. ఈ ఫ్లైఓవర్ ను సీఎం వైఎస్‌ జగన్, కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీతో ప్రారంభం చేయించనున్నారు. అయితే కరోనా నేపథ్యంలో నితిన్‌ గడ్కరీ ఢిల్లీ నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు ఆయన. ఇప్పటికే మూడుసార్లు వాయిదా పడిన ఈ కార్యక్రమం ఈసారైనా జరుగుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. . వాస్తవానికి తొలుత దీనిని సెప్టెంబర్ 4న ప్రారంభించాలి అనుకున్నప్పటికీ ఆ సమయంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ మరణంతో దేశంలో సంతాప దినాలు కొనసాగుతున్న తరుణంలో.. అదేనెలా 8కి మార్చారు.. ఆ తరువాత అనివార్య కారణాలతో రెండోసారి వాయిదా పడింది.

ఈ క్రమంలో గత నెల 18న ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ నితిన్ గడ్కరీకి కరోనా పాజిటివ్ రావడంతో మూడోసారి వాయిదా పడింది.. ప్రస్తుతం నితిన్ గడ్కరీ కరోనా నుంచి కోలుకోవడంతో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కనకదుర్గ ఫ్లై ఓవర్‌ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఈ నెల 16న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అక్టోబర్ 16న ప్రారంభిస్తారని ఇటు రాష్ట్రప్రభుత్వం, విజయవాడ ఎంపీ కేశినేని నాని తెలిపారు.. ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవంతో పాటూ అభివృద్ధి పనులకు భూమిపూజ, ప్రారంభోత్సవాలు జరిగే అవకాశం ఉంది.. మొత్తం రూ.15 వేల 622 కోట్ల పనులకు గడ్కరీ శంకుస్థాపన చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories