విజయవాడ గుణదల మేరీమాత ఉత్సవాలు ప్రారంభం

X
గుణదల మేరీ మాత ఉత్సవాలు
Highlights
విజయవాడ లో నేటి నుంచి మూడు రోజుల పాటు గుణదల మేరీమాతా మహోత్సవాలు ప్రారంభమయ్యాయి.సమిష్టి దివ్యబలి పూజా...
K V D Varma9 Feb 2021 7:23 AM GMT
విజయవాడ లో నేటి నుంచి మూడు రోజుల పాటు గుణదల మేరీమాతా మహోత్సవాలు ప్రారంభమయ్యాయి.సమిష్టి దివ్యబలి పూజా కార్యక్రమాన్ని రెవ.ఫాదర్ మల్లవల్లి బలస్వామి, రెవ.ఫాదర్ వల్లే విజయ జాజి బాబు ఆధ్వర్యంలో నిర్వహించారు.దివ్యబలి పూజ సమర్పించి ఉత్సవాలను బిషప్ జోసఫ్ రాజారావు ప్రారంభించారు.ఈ దివ్యబలి పూజా కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు.
ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ ఉత్సవాలలో వేలాది మంది భక్తులు పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఈ ఉత్సవాల్లో పల్గోవడానికి భక్తులు వస్తారు. మూడు రోజులు నిర్వహించే ఈ ఉత్సవాల్లో చివరి రోజు ప్రత్యేక జాతర నిర్వహిస్తారు. కుల మతాలకు అతీతంగా అందరూ మేరీ మాట పండుగలో పాలు పంచుకుంటారు.
Web TitleVijayawada - Gunadala Meri Matha Utsavams Started
Next Story