చంద్రబాబును కలిసిన విజయసాయిరెడ్డి బావమరిది.. వ్యతిరేకిస్తున్న నేతలు

చంద్రబాబును కలిసిన విజయసాయిరెడ్డి బావమరిది.. వ్యతిరేకిస్తున్న నేతలు
x
Highlights

వైసీపీ రాజ్యసభ సభ్యుడు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి బావమరిది, రాయచోటి మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకానాథరెడ్డి సోమవారం అర్ధరాత్రి అమరావతి...

వైసీపీ రాజ్యసభ సభ్యుడు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి బావమరిది, రాయచోటి మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకానాథరెడ్డి సోమవారం అర్ధరాత్రి అమరావతి లో సీఎం చంద్రబాబును కలిశారు.పార్టీలో చేరే విషయంపై చంద్రబాబుతో చర్చించినట్టు తెలుస్తోంది ఈసారి రాయచోటి తనకు ఇవ్వాలని చంద్రబాబును కోరినట్లు సమాచారం. ద్వారకానాథరెడ్డి 1994లో లక్కిరెడ్డిపల్లె నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలుపొందారు. 2004లో కాంగ్రెస్ చేరారు. అయితే 2009 ఎన్నికల్లో ఆయన సమీప బంధువు శ్రీకాంత్ రెడ్డికి రాయచోటి టికెట్ ఇచ్చారు వైయస్ రాజశేఖర్ రెడ్డి.

అయితే మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా 2011 నుంచి జగన్‌ వెంట నడిచారు. రెండుసార్లు రాయచోటి టికెట్‌ కోసం ప్రయత్నించినా దక్కలేదు. దీంతో ఈసారి ఎలాగైనా పోటీ చెయ్యాలన్న ఉద్దేశ్యంతోనే ద్వారకానాథరెడ్డి టీడీపీలో చేరాలని ఫిక్స్ అయ్యారు. అయితే ద్వారకానాథరెడ్డితో మాట్లాడిన చంద్రబాబు.. ముందు పార్టీలో చేరండి.. నియోజవర్గ నేతలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్లు సమాచారం. కాగా ఆయన రాకను స్థానిక టీడీపీ నేతలు కొందరు వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories