టీడీపీకి మరో ఎదురుదెబ్బ.. వైసీపీలో చేరిన కీలకనేత

టీడీపీకి మరో ఎదురుదెబ్బ.. వైసీపీలో చేరిన కీలకనేత
x
Highlights

టీడీపీకి మరో ఎదురుదెబ్బ.. వైసీపీలో చేరిన కీలకనేత టీడీపీకి మరో ఎదురుదెబ్బ.. వైసీపీలో చేరిన కీలకనేత

ఎన్నికల అనంతరం తెలుగుదేశం పార్టీకి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. తాజాగా ఆ పార్టీకి చెందిన కీలకనాయకుడు విజయనగరం పట్టణాధ్యక్షుడు, జిల్లా కేంద్రాస్పత్రి అభివృద్ధి కమిటీ మాజీ చైర్మన్‌ డాక్టర్‌ వి.ఎస్‌. ప్రసాద్‌ టీడీపీకి గుడ్‌బై చెప్పారు. వైసీపీ సీనియర్ నాయకుడు, మంత్రి బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా ప్రసాద్‌ మాట్లాడుతూ..

జిల్లా అభివృద్ధికోసమే పార్టీ మారానని చెప్పారు. టీడీపీ ఇప్పట్లో కోలుకునే పరిస్థితిలో లేదని జోస్యం చెప్పారు. కాగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. స్థానిక టీడీపీ నేతలు జిల్లాకి చేసిందేమీ లేదు. కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజు గత ముప్పై ఐదేళ్లుగా అనేక పదవులు అనుభవించిని స్థానిక సమస్యలను ఏనాడు పట్టించుకోలేదన్నారు. టీడీపీ నాయకత్వం కారణంగానే ఆ పార్టీ నేతలు తమ పార్టీలో చేరుతున్నారని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories