కనకమేడల నిబంధనలకు విరుద్ధంగా మాట్లాడారు- విజయసాయి రెడ్డి

కనకమేడల నిబంధనలకు విరుద్ధంగా మాట్లాడారు- విజయసాయి రెడ్డి
x

 విజయసాయి రెడ్డి

Highlights

*ఎంపీ కనకమేడలపై రాజ్యసభ ఛైర్మన్‌కు విజయసాయిరెడ్డి ఫిర్యాదు *కనకమేడల వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించకపోవడం దురదృష్టకరం

ఎంపీ కనకమేడలపై రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్మనాయుడుకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో ఎంపీ కనకమేడల సభా నిబంధనలకు విరుద్ధంగా మాట్లాడారన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. కనకమేడల వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించకపోవడం దురదృష్టకరమన్నారు. ఈ నేపథ్యంలో కనకమేడలపై రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యకు ఎంపీ విజయసాయిరెడ్డి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల చేసిన ఆరోపణలను రికార్డుల నుంచి తొలగించాలంటూ విజయసాయిరెడ్డి పాయింట్ ఆఫ్ ఆర్డర్‌ను లేవనెత్తారు. అయితే విజయసాయి లేవనెత్తిన పాయింట్ ఆఫ్ ఆర్డర్‌ను వెంకయ్యనాయుడు తోసిపుచ్చారు. దీనికి నిరసనగా వైసీపీ ఎంపీలు వెల్‌లోకి వచ్చారు. విజయసాయిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని వివిధ పార్టీలకు చెందిన రాజ్యసభ సభ్యులు కోరారు.


Show Full Article
Print Article
Next Story
More Stories