చంద్రబాబుపై విజయసాయిరెడ్డి ఫైర్.. టీటీపీ అంటే (టెంపుల్స్ డిమాలిష‌న్ పార్టీ) అంటూ ట్వీట్

VijayaSai Reddy Comments On Chandrababu
x

విజయ సాయి రెడ్డి 

Highlights

ఏపీలో దేవాల‌యాల‌పై జ‌రుగుతోన్న వరుస దాడులు రాష్ట్రవ్యాప్తంగా క‌ల‌క‌లం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.

ఏపీలో దేవాల‌యాల‌పై జ‌రుగుతోన్న వరుస దాడులు రాష్ట్రవ్యాప్తంగా క‌ల‌క‌లం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. నిందుతులను పట్టుకోవడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని ప్రతిపక్షాలు విమర్శిస్తూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేతపై వైసీపీ ఎంపీ విజ‌యసాయిరెడ్డి ‌ప‌రోక్షంగా విమ‌ర్శ‌లు గుప్పించారు.

'అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధికి అడ్డంగా ఉన్నాయని విజయవాడలో 39 గుళ్లను నేలమట్టం చేశాడు. ఇప్పుడు అధికారం కోసం ఆలయాలను కూల్చి అరాచకం సృష్టించాలని కుట్రలు చేస్తున్నాడు. తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో ఏర్పడిన పార్టీని టెంపుల్స్ డిమాలిష‌న్ పార్టీ (టీడీపీ)గా దిగజార్చాడు. పతనం ఇంతటితో ఆగదు' అని విజ‌య‌సాయిరెడ్డి ట్విట్ట‌ర్ వేదికగ దుయ్యబట్టారు.

కాగా, సీఎం జ‌గ‌న్ పాల‌న‌లో ఏపీలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయంటూ విజ‌య‌సాయిరెడ్డి మ‌రో ట్వీట్ చేశారు. 'అన్ని ప్రాంతాల అభివృద్ధిపై సీఎం జ‌గ‌న్ గారి ప్రత్యేక శ్రద్ధ. భీమిలి నుంచి భోగాపురం వరకూ తీరంలో ఆరు లైన్ల బీచ్‌ రోడ్డు. గోస్తనీ నదిపై సుందరమైన బ్రిడ్జి నిర్మాణం. మంగళగిరి, తాడేపల్లి మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు... వెయ్యికోట్లతో డీపీఆర్ ఆమోదించేందుకు చర్యలు' చేపట్టినట్లు విజ‌య‌సాయిరెడ్డి వెల్లడించారు.
Show Full Article
Print Article
Next Story
More Stories